
సమస్యలుంటే నేరుగా ఫిర్యాదు చేయొచ్చు
కాళేశ్వరం: కాటారం సబ్‌డివిజన్ పరిధిలో ప్రజలకు ఎలాంటి సమస్యలున్న సబ్‌కలెక్టర్ కార్యాలయంలో నేరుగా ఫిర్యాదు చేయొచ్చని సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్ అన్నారు. మహదేవపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీనిఆ కాటారం మయాంక్‌సింగ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందుతుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్టాక్, హాస్టల్ వసతి వివరాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో విద్యాబోధన, హాజరు రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ గురించి చర్చించారు. అక్కడికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే కాటారంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.
కుంట్లంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలపై ఆరా
మహాదేవపూర్ మండలంలోని కుంట్లం గ్రామంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాల విషయంలో ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కుంట్లం గ్రామ ప్రజలు గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉన్నపుడు ముంపునకు గురవుతుందని, ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని సీఎంఓ ప్రజాదర్బార్‌లో ఆర్జి ద్వారా కోరడంతో సబ్ కలెక్టర్ ఇరిగేషన్‌శాఖ వారితో చర్చించినట్లు తెలిపారు. ఈ విషయంలో సమగ్ర పరిశీలన చేసి పూర్తి నివేదిక సమర్పించనున్నట్లు సబ్ కలెక్టర్ గ్రామస్తులకు తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, ఎంపీఓ ప్రసాద్ ఉన్నారు.
కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్
కుంట్లం గ్రామంలో రైతులతో సమావేశం