విద్యలో మనదే అగ్రస్థానం | - | Sakshi
Sakshi News home page

విద్యలో మనదే అగ్రస్థానం

Jul 9 2026 6:35 AM | Updated on Jul 9 2026 6:35 AM

ఉమ్మడి జిల్లా ర్యాంకులు ఇలా తీరు

జనగామ: దేశంలో పాఠశాల విద్యా నాణ్యతను మరింత మెరుగుపరిచే దిశగా కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌–డిస్ట్రిక్ట్‌ (పీజీఐ–డీ) 2025–26 నివేదిక ఫలితాలను వెల్లడించింది. జిల్లాల వారీగా విద్యా ప్రమాణాలు, బోధన నాణ్యత, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల హక్కులు, పాఠశాల భద్రత, డిజిటల్‌ లెర్నింగ్‌, పరిపాలన వంటి ఆరు ప్రధాన అంశాలను పరిశీలించి ఈ ర్యాంకింగ్‌ను రూపొందించారు. 2024–25లో 357 మార్కులతో రాష్ట్రంలో అగ్రస్థానంతో పాటు దేశ వ్యాప్తంగా 96వ ర్యాంకు సాధించిన జనగామ జిల్లా 2025–26లోనూ స్టేట్‌లో నంబర్‌వన్‌ పొజిషియన్‌ను నిలబెట్టుకుని, దేశ స్థాయిలో మరింత మెరుగైన ర్యాంకు దిశగా దూసుకెళ్లింది. విద్యా వ్యవస్థలో లోపాలను గుర్తించి, ఉత్తమ పద్ధతులను విస్తరించి, జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడమే ఈ నివేదిక ప్రధాన ఉద్దేశమని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది.

రాష్ట్రంలో జిల్లాదే తొలి స్థానం

కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన జిల్లాల పనితీరు గ్రేడింగ్‌ సూచీ (పీజీఐ–డీ) జిల్లాల పనితీరు గ్రేడింగ్‌ సూచిక) 2025–26లో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 383 మార్కులు సాధించిన జిల్లా స్టేట్‌లో నంబర్‌వన్‌గా నిలిచి ఉత్తమ్‌–3 గ్రేడ్‌ను దక్కించుకుంది. విద్యార్థుల అభ్యాస ఫలితాలు, తరగతి గది బోధన, మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ విద్య, పాఠశాల పాలన వంటి కీలక విభాగాల్లో జిల్లా మెరుగైన పనితీరు కనబరిచింది. రాష్ట్రంలో వరుసగా రెండోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, దేశ వ్యాప్త ర్యాంకింగ్‌లో 64 స్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది.

విద్యాభివృద్ధికి నిదర్శనం

జిల్లాలో విద్యా ప్రమాణాలు ఏడాదికేడాది మెరుగుపడుతున్నాయి. ఉన్నత విద్యా స్థాయిల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇస్తూ కార్పోరేట్‌ స్థాయి మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ బోధన, ఆధునిక తరగతి గదులు, భద్రతా చర్యలు కల్పిస్తున్నాయి. ఈ చర్యలు విద్యార్థుల నైపు ణ్యాలను పెంపొందించి వారి ఉన్నత భవిష్యత్‌కు బలమైన పునాది వేస్తుండడంతో దేశంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వస్తోంది.

కేంద్ర విద్యాశాఖ పీజీఐ–డీ

నివేదిక వెల్లడి

జాతీయ స్థాయిలో 64,

రాష్ట్రస్థాయిలో 1వ ర్యాంకు

383 మార్కులతో

ఉత్తమ్‌–3 గ్రేడ్‌లో చోటు

జిల్లా రాష్ట్ర మొత్తం గ్రేడ్‌

ర్యాంకు మార్కులు

జనగామ 01 383 ఉత్తమ్‌–3

హనుమకొండ 7 334 ప్రచేస్త–1

వరంగల్‌ 15 323 ప్రచేస్త–2

భూపాలపల్లి 18 317 ప్రచేస్త–2

మహ–బాద్‌ 25 287 ప్రచేస్త–2

ములుగు 27 284 ప్రచేస్త–2

ఉత్తమ్‌ (అత్యుత్తమ పనితీరు)

ప్రచేస్తా–1 (మంచి మెరుగైన తీరు)

ప్రచేస్తా–2 (సగటు కంటే కొంత

మెరుగైన స్థాయి)

ప్రచేస్తా–3 (ఇంకా మెరుగుదల అవసరం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement