సైలెన్సర్లలో మార్పులు చేస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

సైలెన్సర్లలో మార్పులు చేస్తే కఠిన చర్యలు

Jul 9 2026 6:35 AM | Updated on Jul 9 2026 6:35 AM

జనగామ: సైలెన్సర్లలో అనధికారిక మార్పులు చేయించుకోవద్దని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా మోడిఫైడ్‌ సైలెన్సర్లను అమర్చుకుని అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగి స్తున్న ద్విచక్ర వాహనాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 40 బైకులను సీజ్‌ చేసి, వాహ న యజమానులపై మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేశారు. అనంతరం ఆయా వాహనాలకు అమర్చిన మోడిఫైడ్‌ సైలెన్సర్లను తొలగించారు. బుధవారం సీపీ శ్వేతారెడ్డి ఆదేశాల మేరకు డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ పర్యవేక్షణలో సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఐల ఆధ్వర్యంలో పోలీస్‌ కంట్రోల్‌ రూం ఆవరణలో స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు.

బాల కార్మిక నిర్మూలనకు కృషి చేయాలి

బాల కార్మిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ సూచించారు. యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ విభాగం స్కోప్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఉమెన్స్‌ డిగ్రీ కళాశాలలో ప్రిన్సి పాల్‌ సంధ్యారాణి అధ్యక్షతన బాల కార్మిక నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

డీసీపీ రాజమహేంద్ర నాయక్‌

రోడ్డు రోలర్‌తో 40 సైలెన్సర్లు ధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement