గురువారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2026

Jul 9 2026 6:35 AM | Updated on Jul 9 2026 6:35 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

ఈనెల 31తో

ఎల్‌ఆర్‌ఎస్‌ రిబేట్‌కు ముగింపు

ఎల్‌ఆర్‌ఎస్‌ వివరాలు:

జనగామ: జనగామ మున్సిపల్‌ పరిధిలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద ప్రభుత్వం కల్పించిన 25 శాతం ఫీజు రాయితీ ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ గడువులోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి రాయితీని పొందాలని మున్సిపల్‌ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది మే 1 నుంచి 25 శాతం రిబేట్‌ ప్రకటించినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో గడువును జూలై 31 వరకు పొడిగించింది.

మూడు దశల్లో

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశ (ఎల్‌–1)లో ఇరిగేషన్‌, రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తారు. అనంతరం రెండో దశ (ఎల్‌–2)లో మరోసారి వివరాలను ధ్రువీకరించి ఆన్‌న్‌లైన్‌న్‌లో నమోదు చేస్తారు. చివరి దశ (ఎల్‌–3)లో అన్ని వివరాలు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత మున్సిపల్‌ కమిషనర్‌ తుది ప్రొసీడింగ్స్‌ జారీ చేస్తారు.

పెద్ద ఎత్తున ప్రచారం

25 శాతం రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మున్సిపాలిటీ విస్తృత ప్రచారం చేపట్టింది. వార్డు స్థాయిలో సమాచారం అందించడంతో పాటు అర్హులైన వారిని నేరుగా సంప్రదిస్తూ దరఖాస్తులు పూర్తి చేయించే చర్యలు కొనసాగుతున్నా యి. గడువు ముగిసిన తర్వాత రాయితీ వర్తించకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అందువల్ల ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ పూర్తి చేయని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆర్థికంగా లబ్ధి పొందాలని మున్సిపాలిటీ సూచిస్తోంది.

ఎల్‌ఆర్‌ఎస్‌కు దూరం

మున్సిపల్‌ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌ పరిధిలోకి వచ్చిన 18,065 మందిలో ఇప్పటివరకు 13,607 మందికే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు సమాచారం అందించారు. మిగిలిన సుమారు 4,500 మంది ప్లాట్లు విక్రయించడం, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం, పూర్తి స్థాయి చిరునామాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో సమాచారం చేరడం లేదు. దీంతో వారిని గుర్తించి ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడానికి మున్సిపల్‌ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో పట్టణ ప్రణాళిక అధికారులు అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలిస్తూ లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నారు. 100 శాతం ఎల్‌ఆర్‌ఎస్‌ పూర్తి చేయడంతో పాటు మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యాచరణ కొనసాగుతోంది.

చివరి అవకాశం సద్వినియోగం

చేసుకోవాలంటున్న అధికారులు

18 వేల మందికి ఎల్‌ఆర్‌ఎస్‌ అవకాశం

ఇంకా చాలామంది పెండింగ్‌

మున్సిపాలిటీ విస్తృత ప్రచారం

అంశం వివరాలు

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులు 18,065

సమాచారం అందుకున్నవారు 13,607

2020లో రూ.1,000 ఫీజు 2,945

చెల్లించినవారు

2020లో ప్రొసీడింగ్స్‌ 1,996

పొందినవారు

2020 తర్వాత ప్రొసీడింగ్స్‌ 49

పొందినవారు

25 శాతం రిబేట్‌ గడువు జూలై 31

ఎల్‌ఆర్‌ఎస్‌ పరిశీలన దశలు ఎల్‌–1,

ఎల్‌–2, ఎల్‌–3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement