స్టేషన్‌ఘన్‌పూర్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పేదల సంక్షేమం కోసం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపట్టి పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొనియాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిఽథులుగా హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇటీవల రైతు భరోసా నిధులు సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే, ఎంపీ పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్‌ఆర్ అభిమానులు పాల్గొన్నారు. కాగా, స్థానిక అభ్యుదయ యువజన సంఘం అధ్యక్షుడు, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర నాయకుడు పోశాల క్రిష్ణమూర్తి ఆధ్వర్యంలో మహానేత వైఎస్‌ఆర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ హరినాఽథ్ తదితరులు పాల్గొన్నారు.
జయంతి సందర్భంగా ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం నివాళి


