పాఠశాల స్థాయి నుంచే ఎన్‌సీసీ ట్రైనింగ్ పొందినా. నాటి నుంచి పోలీసు అంటే నాకు మక్కువ ఎక్కువ. ఆరేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం శ్రమిస్తున్నా. పోలీసు ఉద్యోగం సాఽధించి కుటుంబానికి అండగా ఉండాలనే లక్ష్యంతో రోజూ క్రీడామైదానంలో నాలుగు గంటలు పరుగు, ఫిట్‌నెస్ అంశంలో సాధన చేస్తున్నా.
– పూజ నాగరాజు,
కరీమాబాద్ వరంగల్
కానిస్టేబుల్ ఉద్యోగమే లక్ష్యం
డిగ్రీ పూర్తయ్యింది. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలన్నదే నాలక్ష్యంగా పెట్టుకున్నా. ఫిట్‌నెస్ కోసం హనుమకొండ జేఎన్ స్టేడియంలో ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంటి వద్ద ఉంటూ సంబంధిత సబ్జెక్ట్‌లు చదువుతున్నా. ఇటీవల ఆర్మీ ఉద్యోగం పరీక్ష రాశాను. ఇంకా ఫలితాలు ప్రకటించలేదు. మొదటి ప్రయత్నంలోనే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించలన్నదే నా కల. ఇందుకు కోచింగ్ సెంటర్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నా.
– పిట్టల సాయి, కాశికుంట వరంగల్


