వర్షాలతో రైతులు నష్టపోకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

వర్షాలతో రైతులు నష్టపోకుండా చూడాలి

Jun 6 2026 12:59 AM | Updated on Jun 6 2026 12:59 AM

జనగామ రూరల్‌: వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా అవసరమైన వాహనాలు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, రైతులు ఆందోళన చెందకుండా రవాణా వేగవంతం చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ.. జిల్లాలో కురిసిన వర్షం నేపథ్యంలో తడిచిన ధాన్యం బస్తాల వివరాలను తెలుసుకొని, క్షేత్రస్థాయిలో పరిశీలించి, తడిచిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. డీఆర్‌డీఓ భాస్కర్‌, డీసీఓ కరుణ, డీపీఓ వెంకట్‌ రెడ్డి, అదనపు డీఆర్‌డీఓ నూరుద్దీన్‌, పౌరసరఫరాల సంస్థ డీఎం హతిరామ్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి రామకృష్ణ, డీసీఎస్‌ఓ సురేష్‌ రెడ్డి, రవాణా శాఖ అధికారి శిల్ప, వ్యవసాయ అధికారి అంబికా సోనీ పాల్గొన్నారు.

కొనుగోళ్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి

రఘునాథపల్లి: ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా రాత్రి, పగలు పని చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. మండలంలోని అశ్వరావుపల్లి, వెల్ది, ఖిలాషాపూర్‌, మండలగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కోమళ్ల టోల్‌ప్లాజా వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్‌ రాజేష్‌రెడ్డి పాల్గొన్నారు.

ధాన్యం రవాణా వేగవంతం చేయాలి

చిల్పూరు: ధాన్యం రవాణాను వేగవంతం చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా నిర్వాహకులను ఆదేశించారు. మండలంలోని చిల్పూరు, రాజవరం, నష్కల్‌ గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ ఆకస్మికంగా సందర్శించారు. ఆయన వెంట ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్‌ విజయ్‌ కుమార్‌, ఐకేపీ ఏపీఎం పిట్టల నరేందర్‌ ఉన్నారు.

రైతులు ఆందోళన చెందొద్దు..

నర్మెట: రైతులకు అండగా ఉంటామని ఆందోళన చెందవద్దని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా భరోసా ఇచ్చారు. మండల కేంద్రంతో పాటు మచ్చుపహాడ్‌లో పీఏసీఎస్‌, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వెంట తహసీల్దార్‌ వెంకట రామానుజాచార్యులు, ఏఓ బుర్ర మమత, ఆర్‌ఐ సింగారపు సాయిబాబ, పీఏసీఎస్‌ సీఈఓ కొన్నె వెంకటయ్య తదితరులు ఉన్నారు.

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement
 
Advertisement
Advertisement