తపాలా శాఖ పథకాలతో ఆర్థిక ప్రగతి | - | Sakshi
Sakshi News home page

తపాలా శాఖ పథకాలతో ఆర్థిక ప్రగతి

Jun 6 2026 12:59 AM | Updated on Jun 6 2026 12:59 AM

రఘునాథపల్లి: భారతీయ తపాలా శాఖ ద్వారా అందిస్తున్న వివిధ రకాల పొదుపు, బీమా పథకాలు, బ్యాంకింగ్‌ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కె.శివాజీ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని వెల్ది గ్రామంలో సర్పంచ్‌ సింగిరెడ్డి సునితాశ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన డాక్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రామ్‌(డీసీడీపీ)లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. తపాలా శాఖ ద్వారా మహిళలు, చిన్నారులు, వృద్ధులు సహా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న పొదుపు పథకాలు, బీమా పథకాలు, అలాగే ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) ద్వారా అందిస్తున్న బ్యాంకింగ్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా వెల్ది గ్రామాన్ని సంపూర్ణ బీమా యోజన గ్రామంగా ప్రకటించారు. సమావేశంలో పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ రవి, విద్యాశాఖాధికారి రఘునందన్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ ఎడ్ల బాలరాజు, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌, బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌ బిర్రు శంకర్‌, మెయిల్‌ ఓవర్సీ చీమలపాటి భాస్కర్‌, పోస్ట్‌ మాస్టర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement