ఇప్పగూడెం గ్రామానికి చెందిన జై హనుమాన్ వీఓ మహిళా సంఘ సభ్యురాలు పోలాసు రాధిక, బీఎస్సీ కెమిస్ట్రీ విద్యార్హతతో మహిళా శక్తి రైతు సేవా కేంద్రం నిర్వహించే అవకాశం పొందారు. కలెక్టర్ సహకారంతో ఎలాంటి లైసెన్స్ ఫీజు లేకుండా కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళా సంఘం ద్వారా రూ.5 లక్షల రుణం తీసుకుని రైతు సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రంలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాల రైతులకు అందుబాటులో ఉన్నాయి. వ్యాపారం ద్వారా ఆదాయం పొందుతూ రుణ వాయిదాలను సక్రమంగా చెల్లిస్తున్నారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం తనకు స్వయం ఉపాధి కల్పించిందని పేర్కొంటూ కలెక్టర్‌కు రాధిక కృతజ్ఞతలు తెలిపారు.


