భూములకు కొత్త విలువ! | - | Sakshi
Sakshi News home page

భూములకు కొత్త విలువ!

Jun 5 2026 4:11 AM | Updated on Jun 5 2026 4:11 AM

స్టేషన్‌ఘన్‌ పూర్‌ మున్సిపాలిటీ

పాత వాల్యుయేషన్‌ (రూ.ల్లో గజం)

కొత్త వాల్యుయేషన్‌ (రూ.ల్లో గజం)

రూ.2,100

రూ.3,100

రూ.2,200

రూ.3,200

రూ.4,700

శివునిపల్లి

స్టేషన్‌ ఘన్‌పూర్‌టౌన్‌

జనగామ: రాష్ట్ర ప్రభుత్వం భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల రిజిస్ట్రేషన్‌ మార్కెట్‌ విలువలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం నేటి(శుక్రవారం)నుంచి అమలులోకి రానుంది. జిల్లావ్యాప్తంగా వ్యవసాయ భూములు, నివాస ప్లాట్లు, వాణిజ్య ప్రాంతాల ఆస్తుల విలువల్లో గణనీయమైన పెరుగుదల ఉండనుంది. ఈ కొత్త మార్కెట్‌ వాల్యుయేషన్‌లు అమలులోకి రానుండగా, రిజిస్ట్రేషన్‌ సమయంలో మార్కెట్‌ విలువపై 7.5 శాతం వరకు రిజిస్ట్రేషన్‌, స్టాంపు డ్యూటీ తదితర చార్జీలు వర్తిస్తాయి. పెరిగిన మార్కెట్‌ విలువ ఆధారంగా ప్లాట్లు, వ్యవసాయ భూముల వాల్యుయేషన్‌ భారంతో పేద, మధ్యతరగతి, సామాన్య కుటుంబాలకు భారం పడనుంది.

మండలాల వారీగా

జఫర్‌గడ్‌ మండలంలో ఎకరం భూమి వాల్యుయేషన్‌ విలువ రూ.2.70 లక్షల నుంచి రూ.3,10,500కు పెరిగింది. ఉప్పుగల్లు, రఘునాథపల్లి, కూనూరు, తిమ్మంపేట, తమ్మడపల్లి(జి), కొనాయిచలం గ్రామాల్లో రూ.6 లక్షల విలువ ఉన్న భూములు రూ.6.90 లక్షలకు చేరనున్నాయి. బచ్చన్నపేట మండలంలో ఎకరాకు రూ.6.75 లక్షలుగా ఉన్న విలువను రూ.8.43 లక్షలకు పెంచగా, మారుమూల ప్రాంతాల్లో రూ.2.25 లక్షల నుంచి రూ.2.80 లక్షలకు పెరిగింది. రూ.40 లక్షల విలువ గల భూమి ప్రస్తుతం రూ.50.82 లక్షలకు చేరనుంది. జనగామ మండలంలో కనిష్ట విలువ రూ.2.25 లక్షల నుంచి రూ.3 లక్షలకు పైగా పెరిగింది. రఘునాథపల్లి మండలంలో రూ.2.25 లక్షల విలువ రూ.2.81లక్షలకు పెరిగింది. జాతీయ రహదారి వెంట ఉన్న భూములకు 25 శాతం వరకు పెంపు అమలవుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ వ్యవసాయ భూముల విలువ లు రూ.2.25 లక్షల నుంచి రూ.2.85 లక్షలకు, రూ.6 లక్షల నుంచి రూ.8లక్షలకు పెరిగాయి. కొడకండ్ల సబ్‌రిజిస్ట్రార్‌ పరిధిలో ప్లాట్ల విలువలు 50 నుంచి 75 శాతం వరకు పెరిగాయి. పాలకుర్తి మండల కేంద్రంలో ప్లాటు వాల్యుయేషన్‌ రూ.1,300 ఉన్న విలువ రూ.2,300లకు, రూ.5,800 ఉన్న విలువ రూ.10,200లకు చేరింది. లింగాలఘణపురం మండలంలో జనగామ–సూర్యాపేట రోడ్డువైపు వ్యవసాయ భూములకు 40 శాతం, ఇతర గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం పెంపు అమలైంది. నెల్లుట్లలో రూ.6.75 లక్షల విలువ గల భూమి రూ.9.45 లక్షలకు పెరిగింది. చిల్పూరు మండలంలో జాతీయ రహదారి పక్కన ఉన్న భూములకు 10 శాతం, నర్మెట మండలంలో వ్యవసాయ భూములకు 30 శాతం వరకు మార్కెట్‌ విలువలు పెరగనున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ వ్యయభారం పెరగనుంది.

నేటినుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు

రియల్‌ ఎస్టేట్‌కు బూస్ట్‌..

కొనేవారికి ఆర్థిక కష్టాలు

జనగామ, ‘స్టేషన్‌’ పురపాలికలో

గజం ధరలకు రెక్కలు

ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు,

భూములకూ కొత్త రేట్లు

పంచాయతీల్లో 82శాతం పెంపు

జోన్‌ పాత వాల్యుయేషన్‌ కొత్త వాల్యుయేషన్‌

1వ జోన్‌(13 బ్లాకులు) రూ.2,100–9,500 రూ.3,200–14,300

2వ జోన్‌(11 బ్లాకులు) రూ.2,100–24,700 రూ.3,200–43,300

3వ జోన్‌(11 బ్లాకులు) రూ.2,100–21,300 రూ.3,200–37,300

4వ జోన్‌ (13 బ్లాకులు) రూ.2,100–14,20 రూ.3,200–24,900

5వ జోన్‌ (6 బ్లాకులు) రూ.2,100–4,100 రూ.3,200–6,200

6వ జోన్‌ (3 బ్లాకులు) రూ.2,100–24,700 రూ.3,200–43,300

జిల్లాలో గతంలో వ్యవసాయ భూములకు కనిష్ట మార్కెట్‌ విలువ ఎకరాకు రూ.2.25 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.2.75 లక్షలకు పెరిగింది. గ్రామపంచాయతీ పరిధిలో ప్లాట్ల విలువలు సగటున 82 శాతం వరకు పెరిగాయి. అపార్ట్‌మెంట్ల విలువల్లో కూడా పెరుగుదల నమోదైంది. గ్రామాల్లో గతంలో గజానికి రూ.500 ఉన్న ప్లాట్‌ విలువను రూ.900లకు, రూ.700ను రూ.1,300లకు, రూ.900ను రూ.1,700లకు, రూ.1,300ను రూ.2,100లకు పెంచారు. జనగామ పట్టణంలోని 30 వార్డులను ఆరు జోన్లుగా విభజించి మొత్తం 57 బ్లాకులుగా పునర్విభజించారు.

Advertisement
 
Advertisement
Advertisement