రేపు జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

రేపు జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపికలు

Jun 5 2026 4:11 AM | Updated on Jun 5 2026 4:11 AM

జనగామ: జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో ఈ నెల 6వ తేదీన జిల్లా స్థాయి అండర్‌ 16, 18, 20 కేటగిరీల్లో బాల,బాలికల అథ్లెటిక్స్‌ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణగౌడ్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో ఎంపిౖకైన క్రీడాకారులు ఈ నెల 11,12తేదీల్లో హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలలో పాల్గొంటారన్నారు. జిల్లాస్థాయి ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు 6వ తేదీన ఉదయం 8 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి మెమోతో మినీ స్టేడియంకు హాజరు కావాలన్నారు. అండర్‌–16ఏళ్ల బాల,బాలికల విభాగంలో 2010 జూన్‌ 7నుంచి 2012 జూన్‌ 6వ తేదీల్లో జన్మించి ఉండాలన్నారు. అండర్‌–18 బాల,బాలికల విభాగంలో 2008 జూన్‌ 13 నుంచి 2010 జూన్‌ 12 వరకు, అండర్‌ –20 బాల,బాలికలు కేటగిరీలో 2006 జూన్‌ 13 నుంచి 2008 జూన్‌ 12 వరకు జన్మించి ఉండాలన్నారు. ఎంపికల సమయంలో 16 సంవత్సరాల బాల,బాలికలకు 100 మీటర్లు, 600 మీటర్లతో పాటు లాంగ్‌జంప్‌, 18 సంవత్సరాల బాల, బాలికలకు 100, 1000 మీటర్లు, 20 సంవత్సరాల బాల,బాలికలకు 100, 400 మీటర్లు, మెన్‌ అండ్‌ ఉమెన్‌ కేటగిరీలో 100, 200, 400, 800, 1500, 5000, 10000, షాట్‌పుట్‌, డిస్కస్‌త్రో, హేమర్‌ త్రో, జావిల్లిన్‌త్రో, హై జంప్‌ విభాగంలో ఎంపికలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు గంగిశెట్టి మనోజ్‌ కుమార్‌–9885046437, ఆవుల అశోక్‌–9912453220, వంచ చంద్రశేఖర్‌రెడ్డి –7799552233, తూడి రంజిత్‌–9985223047 లను సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement