● సీపీ సన్ ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: వ్యాపారస్తులు విద్యా సంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే జైలు జీవితం తప్పదని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ హెచ్చరించారు. స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లోని పాన్ షాపులు, ఇతర దుకాణాలు విద్యార్థులను చెడు అలవాట్ల వైపు మళ్లిస్తున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరుతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. విద్యా సంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల నిషేధం వాల్‌పోస్టర్‌ను గురువారం పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆవిష్కరించారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్‌రెడ్డి, సీసీఆర్‌బీ ఏసీపీ డేవిడ్ రాజు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుజాత, ఏఎస్సై రాజేందర్ ప్రసాద్ పాల్గొన్నారు.


