సాగుకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

సాగుకు సన్నద్ధం

Jun 4 2026 4:58 AM | Updated on Jun 4 2026 4:58 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 4 శ్రీ జూన్‌ శ్రీ 2026

జనగామ: జిల్లాలో వానాకాలం–2026 సీజన్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ సమగ్ర యాక్షన్‌ప్లాన్‌ రూపొందించింది. ఈ సీజన్‌లో 3.77లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటల సాగుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. గత వానాకాలంతో పోలిస్తే వరి సాగు విస్తీర్ణం పెరగగా, పత్తి సాగు కొంత తగ్గనుంది. మొక్కజొన్న సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.

ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు

జిల్లాలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జిల్లాలో పీఏసీఎస్‌లు, ఏఆర్‌ఎస్‌కేఎస్‌లు, హెచ్‌ఏసీఏలు, మహిళా సంఘాలు, ప్రైవేట్‌ డీలర్లతో కలిపి సుమారు 300 ఎరువుల విక్రయ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈనెల 3వ తేదీ నాటికి జిల్లాలో మొత్తం 12,204 మెట్రిక్‌ టన్నుల ఎరువులు నిల్వలు ఉన్నాయి. వీటిలో యూరియా 6,900 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 854 మెట్రిక్‌ టన్నులు, ఎంఓపీ 285 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 385 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 3,600 మెట్రిక్‌ టన్నులు ఉన్నాయి.

సీజన్‌ మొత్తం అంచనా..

వానాకాలం మొత్తం సీజన్‌లో రైతులకు అవసరమయ్యే ఎరువుల పరిమాణాన్ని కూడా అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 28,325 మెట్రిక్‌ టన్నుల యూరియా, 7,781 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 1,401 మెట్రిక్‌ టన్నుల ఎస్‌ఎస్‌పీ, 4,669 మెట్రిక్‌ టన్నుల ఎంఓపీ, 18,676 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అవసరమవుతాయని అధికారులు ముందస్తు అంచనా వేశారు. మొత్తంగా ఎరువుల అవసరం 64,742 మెట్రిక్‌ టన్నులుగా నిర్ణయించారు.

విత్తనాల అంచనా..

విత్తనాల అవసరంపై కూడా వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో 2,13,500 ఎకరాల్లో వరి సాగు జరగనున్న నేపథ్యంలో 53, 375 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమవుతాయి. 1.30లక్షల ఎకరాల్లో పత్తి సాగుకు అవుతుందని అంచనా వేయగా, 26వేల ప్యాకెట్ల పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచనున్నారు. 13వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగుకు 520 క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేశారు. వానాకాలం ప్రారంభానికి ముందే అవసరమైన విత్తనాలు, ఎరువులు సమకూర్చి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని జిల్లా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. పంటల వారీగా సాగు విస్తీర్ణం, ఎరువుల అవసరం, విత్తనాల లభ్యతపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి లక్ష్యాలను సాధించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఎరువులు, విత్తనాల

కొరత లేకుండా చర్యలు

64,742 మెట్రిక్‌ టన్నుల

ఎరువులు అవసరం

వరి 2.13 లక్షలు,

పత్తి 1.30లక్షల ఎకరాల లక్ష్యం

యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ

విత్తనాలు అవసరం..

పంట సాగు విస్తీర్ణం విత్తనాల అవసరం

(ఎకరాలు)

వరి 2,13,500 53,375 క్వింటాళ్లు

పత్తి 1,30,000 26,000 ప్యాకెట్లు

మొక్కజొన్న 13,000 520 క్వింటాళ్లు

వానాకాలం–2026

ఎరువుల అవసరం

(మెట్రిక్‌ టన్నుల్లో)

ఎరువు అవసరం

యూరియా 28,325

డీఏపీ 7,781

ఎస్‌ఎస్‌పీ 1,401

ఎంఓపీ 4,669

కాంప్లెక్స్‌ 18,676

మొత్తం 64,742

వానాకాలం సీజన్‌ సాగు అంచనా 3.77లక్షల ఎకరాలు

వానాకాలం–2026 పంటల సాగు లక్ష్యం

పంట 2025 వానాకాలం 2026 లక్ష్యం

సాగు విస్తీర్ణం (ఎకరాలు)

(ఎకరాలు)

వరి 2,09,343 2,13,500

పత్తి 1,40,026 1,30,000

మొక్కజొన్న 5,560 13,000

కందులు 2,078 2,250

ఇతర పప్పుధాన్యాలు 600 550

నూనెగింజలు 125 200

ఉద్యాన, ఇతర పంటల 17,677 17,500

మొత్తం 3,75,399 3,77,000

Advertisement
 
Advertisement
Advertisement