పక్షుల సంరక్షణకు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

పక్షుల సంరక్షణకు సహకరించాలి

Jun 4 2026 4:58 AM | Updated on Jun 4 2026 4:58 AM

పాలకుర్తి టౌన్‌(దేవరుప్పల): పక్షుల సంరక్షణకు గ్రామస్తులు సహకరించాలని ఓరుగల్లు వైల్డ్‌లైఫ్‌ సొసైటీ కార్యదర్శి శ్యాంసుందర్‌ కోరారు. బుధవారం దేవరుప్పల మండలం చిన్నమడూరులో నైజీరియా పక్షుల విడిది గోపిచెరువులో బర్డ్‌ వాచ్‌ (పక్షుల పరిశీలన)పై అవగాహన కల్పించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా అటవీ శాఖ, ఓరుగల్లు వైల్డ్‌ సొసైటీ ఆధ్వర్యంలో పక్షుల ఆవశ్యకత, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర, వ్యవసాయ రంగానికి అవి అందించే సేవలను వివరించారు. చిన్నమడూరు గోపిచెరువు వలస పక్షులకు ఆవాసంగా గుర్తింపు పొందుతోందన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఎన్‌. భాస్కర్‌, జావేద్‌ హుస్సేన్‌, రమేశ్‌, శోభ, జరీనా, కార్యదర్శి శివారెడ్డి, సర్పంచ్‌ జోగేస్‌ పాల్గొన్నారు.

చిన్నమడూరు గోపిచెరువు వద్ద బర్డ్‌ వాచ్‌

పక్షుల ప్రాముఖ్యంపై అవగాహన

Advertisement
 
Advertisement
Advertisement