● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్/జఫర్‌గఢ్: రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు జరగాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్ రైతువేదికలో కల్యాణలక్ష్మీ, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా సర్పంచ్‌లు లబ్ధిదారులను చైతన్యం చేయాలన్నారు. త్వరలో వరి కోతలు ప్రారంభం కానుండడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సుమన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
మహనీయుల జయంతిని విజయవంతం చేయాలి
జనగామ: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గద్దల కిషోర్ కు మార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే యశస్విరెడ్డి, పాలకుర్తి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, పాలకుర్తి నియోజకవర్గం ఇన్‌చార్జ్ హనుమాన్ల ఝాన్సీరెడ్డిని కలిసి జయంతి ఉత్సవాలకు ఆహ్వానించా రు. అనంతనం జిల్లాకేంద్రంలో మాట్లాడుతూ ఏప్రిల్ 14న అంబేడ్కర్ 135వ జయంతి పురస్కరిచుకుని 13న జిల్లా కేంద్రంలో జ్ఞాన యా త్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ బాధ్యులు బొట్ల శేఖర్, మేడ శ్రీనివాస్, పార్నంది వెంకటస్వామి, గిరిమల్లె రాజు, రాగళ్ల ఉపేందర్, జెరిపోతుల పరుశరాములు, జేరిపోతుల కుమార్, మల్లిగారి రాజు, తదితరులు పాల్గొన్నారు.
పౌష్టికాహారంతో
సంపూర్ణ ఆరోగ్యం
జనగామ రూరల్: పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని, ప్రజలు ఆరోగ్య సూత్రాలు పాటించాలని జనగామ కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.శశి అన్నారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ జనగామ కోర్టు ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయాలన్నారు. వైద్యారోగ్య శాఖ పరంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అనురాధ, రేవతి, ప్రైమరీ హెల్త్ సెంటర్ స్టాఫ్, ఆశవర్కర్లు, లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ ఎం.రవీంద్ర, పారా లీగల్ వలంటీర్స్ సుందరయ్య, అమృత తదితరులు పాల్గొన్నారు.
రైతులకు న్యాయం
చేయాలని ధర్నా
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన మార్క్‌ఫెడ్ సెంటర్‌లో మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా యువజన నాయకుడు కేశిరెడ్డి రాకేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఘన్‌పూర్ మార్క్‌ఫెడ్ సెంటర్‌లో మొక్కజొన్న కొనుగోలులో తీవ్ర జాప్యంతో పాటు సెంటర్ నిర్వాహకులు, ట్రేడర్లు కుమ్మకై ్క జీరో దందా చేస్తున్నారని రైతులు చేస్తున్న ఆరోపణల మేరకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం మార్క్‌ఫెడ్ సెంటర్‌ను సందర్శించారు. ముందుగా సెంటర్‌లో ఉన్న మొక్కజొన్న రైతులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సెంటర్ నిర్వాహకులతో మాట్లాడగా సరైన సమాధానం రా కపోవడంతో రైతులతో కలిసి బీఆర్‌ఎస్ నాయకులు మార్కెట్‌యార్డు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, మార్క్‌ఫెడ్ నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు ధర్నా చేస్తున్నారనే సమాచారం మేరకు మార్కెట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బూర్ల రాజేశ్వర్, చల్లా రమ్యరఘురెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


