పారిశుద్ధ్య పనుల్లో వార్డు సభ్యులు | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య పనుల్లో వార్డు సభ్యులు

Apr 6 2026 7:48 AM | Updated on Apr 6 2026 7:48 AM

నర్మెట: సిబ్బంది కొరతతో మండల కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణ కుంటుపడిందని సర్పంచ్‌ గోపగోని శ్రీధర్‌ గౌడ్‌, వార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వాడవాడలా మురికి కాల్వలలో చెత్త పేరుకుపోవడం, కాలనీల్లో పెరిగిన పిచ్చిమొక్కలతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, చేసేది లేక ఆదివారం తామే స్వయంగా చెత్తను తొలగించాల్సి వచ్చిందన్నారు. నర్మెట గ్రామ పంచాయతీ పరిధిలో 14 వార్డులు, 4,157 ఓటర్లు, 8,371 జనాభా ఉండగా కేవలం 12 మంది పారిశుద్ధ్య సిబ్బంది మాత్రమే ఉన్నారని, 18 అవసరమన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సిబ్బంది నియామకానికి తోడ్పాటు అందించాలని వార్డు సభ్యురాలు పులి రేణుక కనకయ్య కోరారు. చెత్త తొలగించిన సభ్యులను కాలనీ వాసులు ఈసందర్భంగా అభినందించారు.

సిబ్బంది కొరతతో స్వయంగా

చెత్త తొలగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement