సిలిండర్లు నిల్వచేస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

సిలిండర్లు నిల్వచేస్తే కఠిన చర్యలు

Apr 7 2026 7:49 AM | Updated on Apr 7 2026 7:49 AM

డీటీసీఎస్‌ లచ్చునాయక్‌

దేవరుప్పుల : అక్రమంగా వంటగ్యాస్‌ సిలిండర్లు నిల్వచేయడమేగాక నిబంధనలు విస్మరించి వ్యాపారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్‌ సప్లై డిపార్ట్‌మెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నాయబ్‌ తహసీల్దార్‌ లచ్చునాయక్‌ హెచ్చరించారు. సోమవారం కోలుకొండ, సింగరాజుపల్లిలో 23 గ్యాస్‌ సిలిండర్లు స్వాధీనం చేసుకొని మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ విషయమై ఫిర్యాదు మేరకు ఎస్సై ఊర సృజన్‌కుమార్‌ సంబంధిత వ్యక్తులపై 6ఏ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లచ్చునాయక్‌ మాట్లాడుతూ.. గృహాలకు వాడాల్సిన వంట గ్యాస్‌ను హోటళ్లు, టీస్టాల్‌ వంటి వ్యాపార దుకాణాల్లో వినియోగించుకున్నా కేసులు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఆర్‌ఐ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement