పీఎస్‌ హెచ్‌ఎంలకు సూపర్‌వైజర్‌ బాధ్యతలు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

పీఎస్‌ హెచ్‌ఎంలకు సూపర్‌వైజర్‌ బాధ్యతలు ఇవ్వాలి

Apr 6 2026 7:48 AM | Updated on Apr 6 2026 7:48 AM

కలెక్టర్‌కు ప్రధానోపాధ్యాయుల సంఘం వినతి

జనగామ: జనాభా గణన–2026 కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూపర్‌వైజర్‌ బాధ్యతలు అప్పగించాలని కోరుతూ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బుర్రా రమేష్‌, జిల్లా అధ్యక్షుడు చంద్రం ఆదివారం కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాను కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌కు సైతం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనాభా గణన వంటి కీలక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి అనుభవజ్ఞులైన పీఎస్‌ హెచ్‌ఎంల సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఎన్యుమరేటర్ల నియామకాన్ని సీనియారిటీ ఆధారంగా చేపడితే పారదర్శకత పెరుగుతుందని, విధుల నిర్వహణలో సమర్థత సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. వినతిపత్రంపై అధికారులు సానుకూలంగా స్పందించినట్లు సంఘ ప్రతినిధులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement