డీసీసీ కార్యాలయంలో..
జనగామ/ స్టేషన్ ఘన్‌పూర్: మాజీ ఉప ప్రధాని, దళిత వర్గాల ఆశాజ్యోతి, సమతావాది డాక్టర్ బా బు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఆది వారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఆవరణలోని మహనీయుని విగ్రహానికి మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, డీసీపీ రాజమహేంద్ర నాయ క్, అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌లతో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం ఏసీపీ పండరి చేతన్ నితిన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవిలత, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, ఇతర అధికారులు, షెడ్యూల్డ్ కులాల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు, ఎస్సీ సంక్షేమ శాఖ సిబ్బంది జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.
దళితుల సమగ్ర అభివృద్ధిలో అంబేద్కర్, జగ్జీవన్‌రామ్..
దళితుల సమగ్ర అభివృద్ధిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్ రెండు కళ్లలాంటివారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్‌పూర్ డివిజన్‌కేంద్రంలో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి గొప్ప రాజ్యాంగం అందించిన మహనీయుడు అంబేడ్కర్ అయితే ఆ రాజ్యాంగ అమలుకు విశేషంగా కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు. ఘన్‌పూర్‌లో ప్రస్తుతం ఉన్న జగ్జీవన్‌రామ్ విగ్రహం శిథిలావస్థలో ఉందని, దాని స్థానంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీవరకు కొత్త కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని, అదేవిధంగా అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌ల పేరిట రూ.2కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో భవనాన్ని నిర్మిస్తానని హామీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ మారుడోజు రాంబాబు, ఏఎంసీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, తహసీల్దార్ స్వప్న, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని ఫొటోలు 9లో
దేశ స్వాతంత్య్రం, దళితుల సాధికారత కోసం చేసిన పోరాటం గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్‌రామ్ అని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు, డీసీసీ కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు
మాజీ ఉపప్రధానికి ఘన నివాళి


