డీసీసీ కార్యాలయానికి భూమి కేటాయించండి
జనగామ: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం రెండు ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి, టీపీసీసీ సభ్యుడు లక్ష్మినారాయణనాయక్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని సోమవారం కలెక్టర్‌ను ఆయన చాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పార్టీ నిర్మాణం కోసం స్థల కేటాయింపు విషయమై కలెక్టర్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు. అలాగే మున్సిపల్ ఓటర్ తుది జాబితాను పారదర్శకంగా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వేమళ్ల సత్యనారాయణరెడ్డి, ఉడత రవి, గాదెపాక రాంచందర్, జక్కుల అనితవేణు, మూడావత్ సంపత్, పింగిలి ఇంద్రారెడ్డి, కోటా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్ధాయి మ్యాథ్స్
టాలెంట్ టెస్ట్‌కు ఎంపిక
పాలకుర్తి టౌన్: మండలంలోని చెన్నూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి పి. దుర్గాప్రసాద్ రాష్ట్రస్ధాయి మ్యాథ్య్ టాలెంట్ టెస్ట్‌కు ఎంపికైనట్లు చెన్నూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పూస్కూరి రమేశ్‌రావు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 6న సిద్దిపేట గజ్వేల్‌లో జరిగే రాష్ట్రపోటీల్లో దుర్గాప్రసాద్ పాల్గొంటారని తెలిపారు. ఈసందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యా కమిటీ, గ్రామస్తులు విద్యార్థి దుర్గాప్రసాద్‌ను అభినందించారు.
1912 టోల్‌ఫ్రీతో మెరుగైన విద్యుత్ సేవలు
జనగామ: జనగామ సర్కిల్‌లో విద్యుత్ వినియోగదారులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు టీజీఎన్పీ డీసీఎల్‌్ 1912 టోల్‌ఫ్రీ సేవలను మరింత బలోపేతం చేసినట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్(ఎస్‌ఈ) సంపత్‌రెడ్డి తెలిపారు. సోమవారం సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.. 24 గంటలు అందుబాటులో ఉన్న టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా 16 సర్కిళ్ల వినియోగదారులు తమ ఫిర్యాదులను నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు 1912 ద్వారా 859 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు.
యూడీఐడీ సదరం క్యాంపునకు హాజరుకావాలి
జనగామ రూరల్: మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకున్న దివ్యాంగులు యూడీఐడీ సదరం క్యాంపునకు హాజరుకావాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత సోమవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని వివిధ రకాల దివ్యాంగులు కొత్తవారు, రెన్యూవల్ వారు మీ సేవలో యూడీఐడీ వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారు రశీదులో ఉన్న ఫోన్ నెంబర్‌కు మెసేజ్ వచ్చిన తేదీలలో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సదరం శిబిరానికి హాజరుకావాలన్నారు. ఈనెల 7, 9, 19, 20, 21, 22, 28వ తేదీల్లో ఆర్థో, దృష్టి, వినికిడి లోపం, మానసిక, తలసేమియా, క్రానిక్ న్యూరాలజీ సంబంధిత దివ్యాంగులు క్యాంపు ఉంటుందని కొత్తవి 136ఉండగా, రెన్యూవల్ 109 ఉన్నాయని మొత్తంగా 245 మందికి అవకాశం ఉన్నదన్నారు. మరిన్ని వివరాలకు 8008202287 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలన్నారు.
పంటల ఉత్పాదకత లక్ష్యాలు సాధించాలి
జనగామ రూరల్: పంటల ఉత్పాదకత లక్ష్యాలు సాధించేలా ప్రణాళిక బద్ధంగా అధికారులు ముందుకెళ్లాలని సెంట్రల్ నోడల్ ఆఫీసర్ పురుషార్థ అన్నారు. సోమవారం ప్రధానమంత్రి ధన్‌ధాన్య యోజన అమలుపై కేంద్ర ప్రభుత్వం నియమించిన సెంట్రల్ నోడల్ ఆఫీసర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్‌లతో సమీక్ష నిర్వహించారు. గతంలో రూపొందించిన 6 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక, మండల స్థాయిలో లక్ష్యాల సాధనపై సమీక్ష జరిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పథకం అమలులో ఆదర్శవంతమైన జిల్లాగా నిలబెట్టేలా ప్రతీశాఖ సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, సహకార విభాగం, భూగర్భ జలాలు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
డీసీసీ కార్యాలయానికి భూమి కేటాయించండి


