నేటి ప్రజావాణి రద్దు
జనగామ రూరల్: కలెక్టరేట్‌లో ఈనెల 3న(సోమవారం) జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో నష్ట ప్రభావంపై ప్రాథమిక అంచనా కోసం సర్వే చేస్తున్న కారణంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజావాణి రద్దు విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
పాలకుర్తి/దేవరుప్పుల/జఫర్‌గఢ్: మోంథా తుపాను ధాటికి జరిగిన పంటనష్టాన్ని అంచనా వేస్తున్నామని జిల్లా వ్యవసాయాధికారి అంబికా సోని చెప్పారు. ఆదివారం పాలకుర్తి మండలం లక్ష్మినారాయణపురం, గూడూరు, దేవరుప్పుల మండలం రామచంద్రాపురం, జఫర్‌గఢ్ మండలం తిడుగు, సాగరం గ్రామాల్లో తుపానుతో నష్టపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆమెతో కలిసి పంట నష్టం అంచనాలో పాలకుర్తి మండలంలో వ్యవసాయ సంచాలకుడు కరుణాకర్, ఆజ్మీర పరశరామునాయక్, మండల వ్యవసాయ ఎస్.కరుణాకర్, ఏఈవోలు, జఫర్‌గఢ్ మండలంలో ఏడీఏ వసంత సుగుణ, ఏఓ చంద్రన్‌కుమార్, ఏఈఓలు రవి, కుమార్, ప్రశాంత్‌తో పాటు ఆయా గ్రామాల రైతులు ఉన్నారు.
జనగామ రూరల్: ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను చర్చించడానికి నూతనంగా విద్యారంగంలో వస్తున్న మార్పుల దిశగా ఉపాధ్యాయులను కార్యోన్ముఖులను చేయడానికి డిసెంబర్ 28, 29తేదీల్లో జనగామ జిల్లా కేంద్రంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విద్యా మహాసభలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి చెప్పారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్, రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేశ్, రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు విద్యా దేవి సదానందం, సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాశ్, కోశాధికారి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేలాది మంది తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో మేడారానికి తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించి అమ్మవార్లకు పుట్టువెంట్రుకలు సమర్పించుకున్నారు. తల్లుల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంలో భాగంగా గద్దెల చుట్టూ సాలహారం నిర్మాణం పనులు సాగుతుండడంతో భక్తులను పోలీస్ కమాండ్ కంట్రోల్ ద్వారా మీడియా పాయింట్ పక్కన ఉన్న గేట్ నుంచి వెళ్లి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. మొక్కుల అనంతరం భక్తులు చెట్ల కింద భోజనాలు చేశారు.
నేటి ప్రజావాణి రద్దు
నేటి ప్రజావాణి రద్దు


