ఘనంగా గంగబోనం ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా గంగబోనం ఉత్సవాలు

Nov 3 2025 6:26 AM | Updated on Nov 3 2025 6:26 AM

ఘనంగా

ఘనంగా గంగబోనం ఉత్సవాలు

స్టేషన్‌ఘన్‌పూర్‌: డివిజన్‌ కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌ మత్తడి పోయడంతో ఘన్‌పూర్‌కు చెందిన వివిధ కులస్థుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా గంగబోనం ఉత్సవాలు నిర్వహించారు. ప్రధానంగా ముదిరాజ్‌లు, గౌడ కులస్థులు, కురుమల ఆధ్వర్యంలో గంగబోనం ఉత్సవాలను నిర్వహించగా అన్ని కులాలకు చెందిన కులపెద్దలు, గ్రామస్థులు హాజరయ్యారు. కురుమ కులపెద్ద ఇంటి వద్ద నుంచి గంగబోనం డప్పు చప్పుళ్లతో తీసుకురాగా అన్ని కులాలకు చెందినవారు హాజరై స్టేషన్‌ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌ మత్తడి వద్ద ప్రత్యేక పూజలు చేపట్టి గంగబోనాన్ని సమర్పించారు. రిజర్వాయర్‌ మత్తడి వద్ద, కట్ట మైసమ్మ వద్ద, ఘన్‌పూర్‌ బొడ్రాయి వద్ద యాటలను బలి ఇచ్చి ప్రత్యేక పూజలను చేపట్టారు. ఘన్‌పూర్‌ డివిజన్‌ కేంద్రంలో నిర్వహించిన గంగబోనం ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్యక్రమంలో ఘన్‌పూర్‌ మత్స్యసొసైటీ అధ్యక్షుడు నీల సోమన్న, కుల పెద్దలు నీల ఐలయ్య, డైరెక్టర్లు, కులపెద్దలు మునిగెల రమేశ్‌, గోనెల రాజు, నీల రాజు, గోనెల వెంకన్న, నీల సాంబరాజు, నక్క శ్రీను, గోనెల ఐలోని, గోనెల ఉప్పలయ్య, ఎం.ఐలోని, కె.సాంబరాజు, గట్టు ఉప్పలయ్య, బంగ్లా శ్రీను, అమరాజు రాజయ్య, గుంటి రాజయ్య, కృష్ణ, మాజీ ఎంపీటీసీలు గోనెల రాజయ్య, గోనెల ఉపేందర్‌, నాయకులు ఎం.వెంకటేశ్వర్లు, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గంగబోనం ఉత్సవాలు1
1/1

ఘనంగా గంగబోనం ఉత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement