నాలుగు తరాల ‘కల్వా’ కుటుంబం
జనగామ: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు ఆదివారం కుటుంబానుబంధాలకు వేదికై ంది. ఒకే కుటుంబానికి చెందిన నాలుగు తరాలు తాతలు, అమ్మమ్మలు, కోడళ్లు, అల్లుళ్లు, కొడుకులు, కూతుళ్లు, మనవలు, మునిమనవలు ఇలా శ్రీకల్వాశ్రీ కుటుంబానికి చెందిన సుమారు 150 మంది సభ్యులు ఒకేచోట కలిశారు. జనగామ జిల్లా కేంద్రంతో పాటు అమెరికా, హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఈ పుణ్యక్షేత్రానికి చేరుకున్న కుటుంబ సభ్యులు పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్నారు. తమ తాతలు, అమ్మమ్మలు, నానమ్మలకు పాదపూజ చేసి, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం గోమాతకు పూజలు చేసి, ఆవును దానం చేశారు. కుటుంబ సభ్యుల మధ్య బంధాలను బలపరచడమే కాక, చిన్నతరానికి పెద్దల విలువలు పరిచయం చేసే వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది. కుటుంబ కలయికలు తరతరాల బంధాన్ని గుర్తు చేయడంతో పాటు ప్రేమను మరింత బలపరుస్తాయని పెద్దలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఐనవోలు పుణ్యక్షేత్రంలో
వెల్లివెరిసిన అనుబంధం


