
కమిషనరేట్‌లో పోలీస్ అధికారుల బదిలీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ కంట్రోల్ రూం ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డి.విశ్వేశ్వర్ గీసుకొండకు, గీసుకొండ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆకునూరి మహేందర్ పోలీస్ కంట్రోల్ రూంకు బదిలీ అ య్యారు. టాస్క్‌ఫోర్స్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కె.వంశీకృష్ణ గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు, సంగెంలో పని చేస్తున్న నరేశ్‌ను మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌కు, బి.రామారావు సుబేదారి నుంచి జఫర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలని నిరసన
జనగామ రూరల్: తరిగొప్పుల మండలం అంకుశాపూర్ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీకి కేటాయించాలని గ్రామంలోని నాయకులు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. 1957 నుంచి అన్ని కులాలకు రిజర్వేషన్ ఇచ్చారని కానీ ఎస్సీ కులానికి ఇప్పటివరకు సర్పంచ్ రిజర్వేషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ అభ్యర్థులకు రిజర్వేషన్ వచ్చేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో భిక్షపతి, నాగభూషణం కిరణ్‌కుమార్, పైసా ప్రేమ్‌కుమార్, జంజాల సంతోష్, మాచర్ల ప్రేమ్‌కుమార్, చిన్న మూర్తి, ప్రభుదాస్ పాల్గొన్నారు.
ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్
ఉద్యోగానికి ఎంపిక
జనగామ రూరల్: టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఫలితాల్లో పట్టణంలోని వికాస్ నగర్‌కు చెందిన గుండా అరుణాదేవి ఎంపిక అయ్యారు. గృహిణిగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఆన్‌లైన్ కోచింగ్ తీసుకొని ఇంటి వద్ద ప్రణాళిక బద్ధంగా పోటీ పరీక్షకు సన్నద్ధమై విజయం సాధించారు. భర్త చంద్రశేఖర్ కృషి, పిల్లల ప్రోత్సాహం ఉందని ఆమె తెలిపారు.
జఫర్‌గఢ్ నూతన ఎస్సైగా రామారావు
జఫర్‌గఢ్: జఫర్‌గఢ్ నూతన ఎస్సైగా బి.రామారావును నియమిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్‌గా సన్ ప్రీత్‌సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌కు గురైన ఎస్సై రామ్‌చరణ్ స్థానంలో సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న రామారావును జఫర్‌గఢ్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.
టీఏపీటీఏ జిల్లా
అధ్యక్షుడిగా దిలీప్ కుమార్
పాలకుర్తి టౌన్: తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్(టీఏపీటీఏ) జిల్లా అధ్యక్షుడిగా మండల కేంద్రంలోని సుధా హైస్కూల్ ఉపాధ్యాయడు పోలాస దిలీప్‌కుమార్‌ను నియమిస్తు ఆసంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు చందర్‌లాల్ నాయక్ చౌహన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈసందర్భంగా దిలీప్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
కమీషన్ బకాయిలు
వెంటనే చెల్లించాలి
జనగామ రూరల్: జిల్లాలో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ బకాయిలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర రేషన్ డీలర్ల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళీధర్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏవో శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా 330 రేషన్ షాపులు ఉన్నాయని, గత ఆరు నెలల కమీషన్ రాక డీలర్లు నానా ఇబ్బందులు పడ్తున్నారన్నారు. బకాయిలు విడుదల చేయకపోతే అక్టోబర్ నుంచి రేషన్ షాపులు బంద్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఊటుకూరు సబ్బానీ శ్రీధర్, దేవసాని గాలయ్య, చెవ్వా శ్రీను, యాదగిరి, జయపాల్‌రెడ్డి, మల్లయ్య, దయాకర్, రామగల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

కమిషనరేట్‌లో పోలీస్ అధికారుల బదిలీ

కమిషనరేట్‌లో పోలీస్ అధికారుల బదిలీ

కమిషనరేట్‌లో పోలీస్ అధికారుల బదిలీ