
జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు గురుకుల విద్యార్థి
స్టేషన్‌ఘన్‌పూర్: ఎస్‌జీఎఫ్ అండర్–19 విభాగంలో జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు స్టేషన్‌ఘన్‌పూర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థి మారపాక గిరీశ్‌వర్ధన్ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రఘుపతి, పీడీ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు జనగామలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్ 19 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొన్న స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవతర్సం (ఎంపీసీ) చదువుతున్న విద్యార్థి గిరీశ్‌వర్ధన్ ఉత్తమ ప్రతిభతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. అక్టోబర్ 5 నుంచి 8వ తేదీ వరకు జమ్ముకశ్మీర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
బాల్‌బ్యాడ్మింటన్
పోటీల్లో మూడో స్థానం..
చిల్పూరు: మండలంలోని చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన గుంపుల రామ్మోహన్‌రెడ్డి–శిరీష కుమారుడు అశ్వతేజ్‌రెడ్డి జాఈయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని మూడో స్థానంలో నిలినట్లు జిల్లా అధ్యక్షుడు గాదెపాక అయోధ్య, ప్రదాన కార్యదర్శి నీరటి ప్రభాకర్ తెలిపారు. గ్రామానికి చెందిన అశ్వతేజ్‌రెడ్డి ప్రస్తుతం ఐనవోలు మండల కేంద్రంలోని పాత్‌ఫైండర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల జఫర్‌గఢ్ మండలం కూనూరు గ్రామంలో నిర్వహించిన 44వ సబ్ జూనియర్ బాల్‌బ్యాడ్మింటన్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. అందులో భాగంగా ఈనెల 25 నుంచి 28 వరకు తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్‌లో నిర్వహించిన పోటీల్లో తెలంగాణ టీమ్ నుంచి పాల్గొని మూడో స్థానంలో నిలిచినట్లు కోచ్ ముచ్చ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు గురుకుల విద్యార్థి