
సాదాబైనామాలను వేగంగా పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్
బచ్చన్నపేట: భూభారతి చట్టంలో ఆయా గ్రామాల వారీగా వచ్చిన భూ సమస్యలను, సాదాబైనామాలను వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..జీపీఓలు ఎంఆర్‌ఐలు గ్రామాల్లో పర్యటించి భూసమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. ఎవరి ప్రలోభాలకు లొంగకూడదని చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామానుజాచారి, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, ఎంఆర్‌ఐలు వంశీకృష్ణ, మున్వర్, సిబ్బంది యాకయ్య, జీపీఓలు పలువురు పాల్గొన్నారు.