
ఆందోళన కలిగిస్తోంది..
మా అమ్మాయి పెళ్లి కోసం బంగారం కొనే ఆలోచనలో ఉన్నాం. కానీ ధరలు తగ్గితే కొనాలని వాయిదా వేసుకున్నాం. అయితే ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడంతో ఇకపై తగ్గే పరిస్థితి కనిపించట్లేదు.
– చింతకింది ఉమ, గృహిణి, పాలకుర్తి
బంగారం కొనలేము..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక గ్రాము బంగారం కొనలేము. వారం రోజుల కిందట నా కూతురు వివాహం చేశాను. ఐదు తులాల బంగారం కోసం రూ.5లక్షలు తీసుకుని వెళితే, నాలుగు తులాల మాత్రమే వచ్చింది. మరో 10 గ్రాములు పెండింగ్‌లో ఉంది.
– గంధమాల కిష్టయ్య, బచ్చన్నపేట
తయారీ తగ్గింది..
బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో ఆభరణాలు చేయించుకునే వారి సంఖ్య తగ్గింది. గతంలో ప్రతి నెల వంద కుటుంబాలు ఆభరణాలు తయారు చేయించుకుంటే, ప్రస్తుతం పదిమందికి పడిపోయింది. చాలా మంది బంగారం బిస్కెట్లు కొనుగోలు చేసి భద్రపరుచుకుంటున్నారు. దీంతో ఆభరణాల తయారీ కార్మికులకు ఆర్థిక భరోసా దూరమవుతోంది.
– నల్లనాగుల శ్రీనివాస్,
జ్యువెల్లరీ వ్యాపారి, జనగామ
●

ఆందోళన కలిగిస్తోంది..

ఆందోళన కలిగిస్తోంది..