ఉత్పాదకతకు ఊతం | - | Sakshi
Sakshi News home page

ఉత్పాదకతకు ఊతం

Oct 1 2025 10:15 AM | Updated on Oct 1 2025 10:15 AM

ఉత్పా

ఉత్పాదకతకు ఊతం

జనగామ రూరల్‌: వ్యవసాయ ఉత్పాదకత పెంచి ఆర్థిక ఎదుగుదలకు కేంద్ర ప్రభుత్వం మరింత భరోసా కల్పించేందుకు ప్రధానమంత్రి ధన్‌ధాన్య కృషి యోజన పథకం ఉపయోగపడనుంది. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, పంటల వైవిధ్యీకరణ, మెరుగైన నీటిపారుదల, రుణాల సులభతరం లక్ష్యంగా ఈ పథకం వ్యవసాయ రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 100 జిల్లాలను గుర్తించగా ఇందులో తెలంగాణ నుంచి ఎంపికై న 4 జిల్లాల్లో జనగామ జిల్లాకు చోటు లభించింది. ఎంపికై న జిల్లాల్లో రూ.960 కోట్ల వార్షిక వ్యయంతో ఆరేళ్లపాటు ఈ పథకం అమలుకానుంది. వ్యవసాయ ఉత్పాదకత, పంటల మార్పిడి, నీటిపారుదల, నిల్వ, ఉత్పత్తుల విలువ పెంచే విధంగా ప్రాసెసింగ్‌ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వ్యవసాయ రంగం అభివృద్ధి చెందనుంది.

పథకం అమలు విధానం

జిల్లాల్లో ఉత్పాదకత, మౌలిక సదుపాయాలు రైతులు ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈపథకం అమలవుతోంది. 36 కేంద్ర, రాష్ట్ర పథకాల సమన్వయం చేస్తూ ఈ పథకం కింద 11 మంత్రిత్వ శాఖలు, విభాగాల కింద అమలుకానున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి, ప్రధానమంత్రి ఫసల్‌ బీమాయోజన, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, మిషన్‌ ఆన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌, మిషన్‌ ఆన్‌, ఆయిల్‌ పామ్‌, హార్టికల్చర్‌ మిషన్‌, కృషి యోజన ఉన్నాయి. జిల్లా స్థాయి కమిటీలు, రాష్ట్ర స్థాయి స్టీరింగ్‌ గ్రూపులు, జాతీయస్థాయి పర్యవేక్షణ సంస్థలతో ఈ పథకం మూడు అంచెల ద్వారా అమలవుతోంది. జిల్లా స్థాయిలో, కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా ధన్‌ధాన్య కృషి సమితి ఏర్పాటు కానుంది.

ప్రణాళికలు ఇలా..

జిల్లాస్థాయిలో బేస్‌ లైన్‌ సర్వే నిర్వహించి ఉత్పాదకత లోపాలు, నీటి వనరులు, మార్కెట్‌ మౌలిక సదుపాయాలు, కోల్ట్‌ స్టోరేజ్‌, రుణాల పరిస్థితి మొదలైన అంశాలను విశ్లేషణ చేసి వాటి ఆధారంగా 5 సంవత్సరాల ఫలితాల ఆధారిత కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. క్షేత్రస్థాయి పర్యవేక్షణను బలోపేతం చేయడానికి, ప్రతి జిల్లాకు కేంద్ర నోడల్‌ అధికారులను నియమిస్తారు. పురోగతిని పర్యవేక్షించడం, స్థానిక బృందాలతో సమన్వయం చేసుకోనున్నారు. అన్ని కన్వర్జింగ్‌ పథకాల సమన్వయ అమలుకు మార్గనిర్దేశం చేస్తూ జిల్లా పురోగతిని కేంద్ర పర్యవేక్షణ పనితీరు సూచికలు ఉపయోగించి ట్రాక్‌ చేస్తూ పనితీరును అంచనా వేయడానికి, అంతరాలను గుర్తించి జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి నెలవారీగా సమీక్షిస్తారు. ఈ పథకం పంటల వ్యవసాయం మాత్రమే కాకుండా పండ్లు, మత్స్య సంపద, తేనెటీగల పెంపకం, పశుసంవర్ధకం, వ్యవసాయ అటవీ రంగాలపై దృష్టి పెడుతుంది. స్కేల్‌, టెక్నాలజీ, సంస్థాగత బలాన్ని పెంచడం ద్వారా ఈ పథకం గ్రామీణ ఉత్పాదకతలో విశేషమైన మార్పు తీసుకరానుంది.

పథకం లక్ష్యాలు..

వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించడం

సుస్థిర వ్యవసాయ పద్ధతులను విస్తరించడం

పంచాయతీ, బ్లాక్‌ స్థాయిలో పంట కోత అనంతరం నిల్వ సదుపాయాలను బలోపేతం చేయడం

మైక్రోఇరిగేషన్‌ వంటి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం

తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యవసాయ రుణాలను సులభతరం చేయడం.

పీఎం ధన్‌ధాన్య కృషి యోజన పథకానికి జనగామ ఎంపిక

పంటల వైవిధ్యీకరణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులకు ప్రోత్సాహం

నీటిపారుదల, మౌలిక సదుపాయాల మెరుగు

స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలకు ప్రాధాన్యం

సమగ్ర వ్యవసాయమే లక్ష్యం

ప్రధానమంత్రి ధన్‌ధాన్య కృషి యోజన పథకం కింద జనగామ జిల్లా ఎంపికై ంది. వ్యవసాయంలో అత్యంత నిరంతర నిర్మాణాత్మక సవాళ్లను పరిష్కరిస్తూ ఉత్పాదకతను పెంచడానికి, స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించ డానికి, జీవనోపాధిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.

– కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా

ఉత్పాదకతకు ఊతం1
1/1

ఉత్పాదకతకు ఊతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement