
పాకాలలో పర్యాటకుల సందడి
ఖానాపురం: ఖానాపురం మండలంలోని పాకాలలో పర్యాటకుల సందడి నెలకొంది. పండుగ సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చి పాకాల మత్తడి వద్ద సందడి చేశారు. బోటింగ్ చేయడంతో పాటు లీకేజీ నీటిలో జళకాలాడుతూ ఉత్సాహంగా గడిపారు. దీంతో పాకాలలో సందడి నెలకొంది.
పరవళ్లు తొక్కుతున్న పాకాల
ధాన్యాగార ప్రాంతానికి ప్రధాన నీటి వనరు పాకాల. ఈ సరస్సు ఆగస్టు 15వ తేదీ నుంచి నేటి వరకు మత్తడి పోస్తోంది. సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 30.3 ఫీట్లు కాగా పూర్తిస్థాయిలో నిండుకొని 47 రోజులుగా మత్తడి పోస్తుంది. కురుస్తున్న వర్షాలతో సరస్సులో నిండుకుండలా ఉండటంతో మత్తడి పరవళ్లు కొనసాగుతోంది.