
స్థానిక సంగ్రామం
జనగామ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత గ్రామపంచాయతీ ఎలక్షన్లను నిర్వహిస్తామని ప్రకటించింది. ఈసీ ప్రకటనతో పల్లెల్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం హీ టెక్కింది. జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్ పరిధిలో 12 మండలాలు ఉండగా, 12 జెడ్పీటీసీ స్థానాలు, 134 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొదటి విడత అక్టోబర్ 9, రెండో విడత 27న పోలింగ్ జరుగనుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికార యంత్రాంగం ఎలక్షన్ నిర్వహణపై పూర్తి స్థాయి దృష్టి సారించింది.
రెండు దశల్లో పోలింగ్..
జిల్లాలో ఎలక్షన్లు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు సంబంధించి వచ్చే నెల అక్టోబర్ 9వ తేదీన నామినేషన్ల స్వీకరణ మొదలు కానుండగా, 23వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో దశ ఎన్నికలు 13న నామినేషన్లు, 27న పోలింగ్ జరుగనుంది. జిల్లాలోని 12 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 12 జెడ్పీటీసీలు, 134 మంది ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల పరిధిలో 294 పోలింగ్ లొకేషన్లు ఉండగా, 783 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొదటి దశలో 6 మండలాల పరిధిలో 70 ఎంపీటీసీలు, రెండో దశలో 6 మండలాల పరిధిలో 64 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎలక్షన్ అధికారులు, సిబ్బంది సిద్ధం..
ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని ఆర్వోలు, ఏఆర్వోలు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఏపీఓలు, ఓపీఓలకు బాధ్యతలు కేటాయించారు. పోలింగ్ సెంటర్లు సిద్ధం చేసి, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
దసరా పండుగ–ఓటర్ల ప్రసన్నం..
దసరా పండుగ వాతావరణం ఈ ఎన్నికలకు ప్రత్యేక రుచిని తెచ్చింది. పండుగ వేళను దృష్టిలో ఉంచుకొని ఆశావాహులు ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేసేందుకు సిద్ధమవుతూనే... తమ వర్గాల మద్దతు బలపడేలా ప్రత్యేక వ్యూహాలు రూపొందిస్తున్నారు.
కోడ్ అమలులోకి..
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా స్థానిక సంస్థల ఎలక్షన్ నేపథ్యంలో జిల్లాలో కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏఎస్పీ చేతన్ పండేరి నితిన్‌తో కలిసి కలెక్టరేట్ సమావేశం హాల్‌లో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నిలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయగా, వచ్చే నెల 9వ తేదీన నోటీసు జారీ చేస్తుందన్నారు. మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో 9వ తేదీ (చివరి తేదీ 11), రెండో విడతలో 13వ తేదీ (చివరి తేదీ15) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందన్నారు. మొదటి విడత అభ్యర్థుల ఫైనల్ జాబితా 15న, రెండో విడత 19న ప్రచురించడం జరుగుతుందన్నారు. మొదటి విడతలో 23, రెండో విడత 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీలు, అభ్యర్థులు నియమావళిని పాటించాలన్నారు. జిల్లాలోని మునిసిపాలిటీల పరిధిలో ఎన్నికల కోడ్ ఉండదన్నారు.
మోగిన ఎన్నికల నగారా
రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
జిల్లాలో రెండు విడతల్లోనే సర్పంచ్ ఎన్నికలు
12 జెడ్పీటీసీలు, 134 ఎంపీటీసీలు, 280 గ్రామపంచాయతీలు
4,01,496 మంది ఓటర్లు
రెండు విడతల్లోనే సర్పంచ్ ఎన్నికలు..
జిల్లాలో 280 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,534 వార్డులు, 30 వందశాతం ఎస్టీ జీపీలు ఉండగా, షెడ్యూల్డ్ ఏరియా జీపీలు 241 ఉన్నాయి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతుండగా, జిల్లాలో మాత్రం రెండో విడత నుంచి నుంచి ప్రారంభంకానున్నాయి. రెండో విడత నవంబర్ 4న, మూడో విడత 8వ తేదీన పోలింగ్ జరుగనుంది. రెండో విడతలో 7 మండలాల పరిధిలో (142 జీపీలు), మూడో విడతలో 5 మండలాల పరిధి(138 జీపీలు)లో పోలింగ్ జరుగనుంది. రెండో విడతలో జరిగే జీపీలు చిల్పూరు మండలం (17 జీపీలు, 168 వార్డులు), స్టేషన్‌ఘన్‌పూర్(15/46), జ ఫర్‌గడ్(21/94), రఘునాథపల్లి (36/320), లింగాలఘణపురం (21/196), నర్మెట(17/48), తరిగొప్పుల (15/126), మూడో విడతలో బచ్చన్నపేట (26/238), జనగామ(21/198), దేవరుప్పుల(32/274), పాలకుర్తి (38/33 6), కొడకండ్ల(21/190) జీపీల పరిధిలో ఎలక్షన్లు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.

స్థానిక సంగ్రామం

స్థానిక సంగ్రామం