
పింఛన్లను తక్షణమే పెంచాలి
● ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
బోడ సునీల్‌మాదిగ
స్టేషన్‌ఘన్‌పూర్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతవులకు తక్షణమే పింఛన్లను పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జనగామ జిల్లా ఇన్‌చార్జ బోడ సునీల్‌మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం ఘన్‌పూర్ డివిజన్‌కేంద్రంలో ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్, ఎంఎస్‌పీ జిల్లాస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.. దివ్యాంగుల పెన్షన్‌ను రూ.4వేల నుంచి రూ.6వేలకు, వృద్ధులు, వితంతువుల పెన్షన్‌ను రూ.2016 నుంచి రూ.4వేలకు పెంచుతానని ఎన్నికల సీఎం రేవంత్‌రెడ్డి చేసిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. లేనిపక్షంలో సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్‌లను పెంచాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 6 నుంచి నవంబర్ 6వ తేదీవరకు నిర్వహించనున్న మహాదీక్షలను ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్, ఎంఎస్‌పీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బొట్ల మహేశ్, గాదె శ్రీధర్, గుర్రం నవీన్, గుర్రం అశోక్, సంపత్, సోమన్న, శ్రీను, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.