
ముందస్తు చర్యలు చేపట్టాలి
జనగామ రూరల్: సీజనల్ వ్యాధులపై ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం మండలంలోని పెంబర్తి జీపీ ఆవరణలోని సబ్ సెంటర్‌ను కలెక్టర్ ఆకస్మికంగా త నిఖీ చేశారు. సిబ్బంది రిజిస్టర్, మందుల నిల్వను పరిశీలించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భా గంగా ఇప్పటివరకు ఎంత మందికి స్క్రీనింగ్, ఎక్స్‌రే చేశారని, ఓపీ నమోదు, మలేరియా, డెంగీ కేసుల వివరాలను వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని హాకా ఫార్మర్ సెంటర్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసి స్టాక్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ యూరియా కొరత లేదని, ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం పట్టణ సుందరీకరణలో భాగంగా హైదరాబాద్ రోడ్డు వైపు జరుగుతున్న అభివృద్ధి పనులను, రెండో వార్డులోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకుంటే ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా