బాధ్యతాయుతంగా పనిచేయండి
మల్లాపూర్: కొత్తగా ఎన్నికై న పాలకవర్గాలు బాధ్యతాయుతంగా పనిచేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. మండలంలోని ఆయన స్వగ్రామమైన రాఘవపేటలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో సతీసమేతంగా పాల్గొన్నారు. ఎప్పటికప్పుడూ గ్రామసభలు నిర్వహిస్తూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. సర్పంచ్ తోట శ్రీనివాస్, ఉపసర్పంచ్ మద్దెల నర్సయ్య, వార్డుసభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు బైరి రవికుమార్‌యాదవ్, దేవారెడ్డి, దేశేట్టి నాగేష్, బోయిని సిద్దయ్య, రాకేష్, అమిన్ తదితరులు పాల్గొన్నారు.


