పట్టాభూమికి హద్దులు నిర్ణయించండి
మాది కొడిమ్యాల మండలం సూరంపేట. గ్రామ శివారులోని సర్వేనంబర్ 167లో ఎకరం భూమికి 30ఏళ్ల క్రితం మా తండ్రి బానల ఎల్లయ్యకు ప్రభుత్వం పట్టా ఇచ్చింది. ఇదే సర్వే నంబర్‌లో బానల తిరుపతికి మరో ఎకరం పట్టా ఇచ్చింది. అప్పటినుంచి కాస్తులో ఉన్నాం. 2007లో మా తండ్రి చనిపోవడంతో తల్లి పేరిట విరాసత్ చేశారు. నాలుగేళ్ల క్రితం గ్రామానికి చెందిన కొందరు సదరు భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాం. ఆక్రమణదారులకు ఎలాంటి హక్కులూ లేవు. మా భూమికి హద్దులు నిర్ణయించి ఆక్రమణదారుల నుంచి కాపాడండి.
– బానల నర్సయ్య, సూరంపేట


