ప్రజావాణికి సమస్యల వెల్లువ
జగిత్యాలటౌన్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన 34 అర్జీలను పరిశీలించారు. సమస్యలపై విచారణ జరిపి పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు బీఎస్.లత, రాజాగౌడ్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ హారిణి, కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
‘డబుల్’ అర్జీలకు రశీదులు నో..
డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం వచ్చే అర్జిదారులను ప్రజావాణి హాల్‌లోకి రాకుండా అధికారులు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్‌లో అర్జీలు ఇస్తున్న వారికి మాత్రం రశీదులు ఇవ్వడం లేదు. తమకు ఇళ్లు రావడం లేదని ప్రజావాణికి వచ్చి దరఖాస్తు చేసుకుంటే కనీసం రశీదు కూడా ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 2008లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన స్థలాన్ని స్వాధీనం చేసుకుని తమకు ఇళ్లు ఇస్తామని హామి ఇచ్చిన అధికారులు ఇప్పుడు ఇవ్వడంలేదని వాపోయారు.


