విద్యార్థులు కంటి చూపుపై శ్రద్ధ తీసుకోవాలి
జగిత్యాల: విద్యార్థులు సెల్‌ఫోన్లకు అలవాటు పడటంతో కంటి చూపుపై ప్రభావం పడుతోందని, కళ్లపై శ్రద్ధ తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. సోమవారం గొల్లపల్లి రోడ్‌లోని మైనార్టీ గురుకులం పాఠశాల విద్యార్థినులకు కంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 41 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించారు. ప్లిలలందరూ ఆకుకూరలు, క్యారెట్, బొప్పాయి తీసుకోవాలని, కళ్లు కా పాడుకోవాలని, సెల్‌ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే వైద్యులు సురేందర్, డాక్టర్ విద్య, ఆప్తలిక్ ఆఫీసర్ తిరుపతి, ప్రిన్సిపల్ సుచరిత పాల్గొన్నారు.


