యాచకుల రహిత రామగుండం లక్ష్యం
కోల్‌సిటీ(రామగుండం): యాచకుల రహిత రామగుండం నగరంగా తీర్చిదిద్దడానికి ప్రతీఒక్కరు సహకరించాలని బల్దియా కమిషనర్ అరుణశ్రీ కోరారు. స్మైల్ ప్రాజెక్ట్ (సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ ఫర్ లైవ్లీహుడ్ ఎంటర్ ప్రైజెస్) నిర్వాహక సంస్థ శ్రీవినాయక విమెన్(అర్బన్) త్రిఫ్ట్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు రూపొందించిన పోస్టర్‌ను శుక్రవారం బల్దియాలో ఆవిష్కరించారు. కమిషనర్ మాట్లాడుతూ, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా అమలవుతున్న ఈ ప్రాజెక్ట్‌లో యాచకులను గుర్తించి పునరావాసం కల్పిస్తుందన్నారు. గోదావరిఖని తిలక్‌నగర్ డౌన్‌లో స్మైల్ ప్రాజెక్ట్ పునారావాస కేంద్రాన్ని మెప్మా నిర్వహిస్తుందని తెలిపారు. ఇందులో ఉచిత వసతి, మూడు పూటలా భోజనం, ఆసక్తి గలవారికి వివిధ అంశాల్లో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తుందని వివరించారు. యాచకులు కనిపిస్తే 70135 84588, 86397 17597 నంబర్లకు ఫోన్‌చేసి సమాచారం అందించాలని ఆమె కోరారు. ఈ అడిషనల్ కమిషనర్ మారుతీప్రసాద్, కార్యదర్శి ఉమామహేశ్వర్‌రావు, మెప్మాటౌన్ మిషన్ కో ఆర్డినేటర్ మౌనిక, సీవో ఊర్మిళ, పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు నూనెలతా మోహన్, నిర్వాహకులు శరత్ మోహన్, మమత తదితరులు పాల్గొన్నారు.


