Viral Video: Russia Released Tourism Video In Social Media That Mocks West - Sakshi
Sakshi News home page

Russia Tourism Video: టైం చూసుకుని దెబ్బ కొడుతున్న రష్యా... టెన్షన్‌లో పాశ్చాత్య దేశాలు

Aug 1 2022 8:05 PM | Updated on Aug 2 2022 8:45 AM

Viral Video: Russia Post Tourism Video In Social Media That Mock West - Sakshi

ఎన్ని ఆంక్షలు విధించి ఒంటిరి చేయాలనుకున్న తట్టుకుని నిలబడగలనంటున్న రష్యా. తమ దేశ పర్యటనకు రండి అని ఆహ్వానిస్తున్న మాస్కో. విస్తుపోయిన పాశ్చాత్య దేశాలు.

Russia released a video invites people to move to Russiaఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలన్ని రష్యా తీరుని ఖండించడమే కాకుండా ఆంక్షలతో ఇబ్బంది పెట్టాయి. అయినా రష్యా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో యుద్ధానికి సై అంది. ఎంతలా ఆర్థిక ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేసి ఒంటరిని చేసినా భయపడలేదు సరికదా ప్రపంచదేశాలపైనే కన్నెర్రె జేసింది. ఆఖరికి ప్రంపచ దేశాలే తలొగ్గి కిందకి దిగి వచ్చాయి గానీ, రష్యా మాత్రం తగ్గేదేలే అంటూ దూకుడు పెంచింది. ఏ ఆంక్షల్ని ఖాతరు చేయలేదు. రష్యా పై ఆధారపడకుండా ఉండేలా ఎగుమతులను నిషేధించిన వెనుకంజవేయలేదు.

చివరికి ఈ యుద్ధం ప్రపంచ దేశాల్ని గడగడలాడించడమే కాకుండా ఆహార సంక్షోభం, ఆర్థిక సంక్షోభం తలెత్తే పరిస్థితి ఎదురైంది. ఆఖరికి ఐక్యరాజ్యసమతి ముందుకు వచ్చి రష్యాని ప్రపంచ శాంతి దిశగా అడుగులు వేయమని అభ్యర్థించాల్సి వచ్చింది. ఈ తరుణంలో రష్యా పాశ్చాత్య దేశాలను ఎగతాళి చేసేలా  తమ దేశ పర్యటనకు సంబంధించిన టూరిజం వీడియోని రష్యా విడుదల చేసింది.

పైగా ఆ వీడియోలో రష్యా పర్యటనకు ప్రజలను ఆహ్వానిస్తూ... మా దేశంలోని రుచికరమైన వంటకాలు, అందమైన మహిళలు, చౌకగా లభించే గ్యాస్‌, మా దేశ వైభవం తదితరాలన్నింటిని వీక్షించేందుకు ఆహ్వానిస్తున్నాం అంటూ ఒక ఆడియో​ కూడా వినిపిస్తుంది. అంతేకాదు రష్యాలో రద్దు సంస్కృతి అనేది లేదని పేర్కొంది. ఆ వీడియో చివర్లో ఇది రష్యా దేశం, వేలాది ఆంక్షలను తట్టకుని నిలబడగల బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉ‍న్న గొప్ప దేశం కాబట్టి ఈ దేశాన్ని చూసేందుకు త్వరితగతిన రండి, శీతకాలం వచ్చేస్తోంది అంటూ పోస్ట్‌ చేసింది.

ఈ వీడియోని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రష్యన్‌ రాయబార కార్యాలయాలు సోషల్‌ మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు జౌను! ఇది రష్యా ఒక్క రాత్రిలో ఉక్రెయిన్‌ అమాయకులపై కాల్పులు జరిపి లక్షలాది మందిని నిరాశ్రయులను చేయగల సమర్థవంతమైన దేశం అంటూ విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. 

(చదవండి: అవమానపడ్డ టూరిస్ట్‌...టచ్‌ చేయకూడనవి టచ్‌ చేస్తే ఇలానే ఉంటుంది!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement