ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్దం ఇప్పట్లో తెగేలా లేదు. తాజాగా అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఇరాన్‌తో యుద్ధానికి అమెరికా ప్రభుత్వం వద్ద కావాల్సినన్ని నిధులు ఉన్నాయని బెసెంట్ తెలిపారు. భవిష్యత్తులో సైన్యం అవసరాలకు అదనపు నిధులు అవసరం పడవచ్చని అన్నారు. యుద్దానికి నిధులు సమకూర్చేందుకు పన్నులు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
రక్షణ శాఖ 200 బిలియన్ డాలర్ల అదనపు నిధులు కోరిందని తెలిపారు. యుద్ధం మొదటి ఆరు రోజుల్లోనే 11 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయని వెల్లడించారు. బెసెంట్ వ్యాఖ్యల తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ సైన్యాన్ని మరింత బలపరిచారు. భవిష్యత్తులో కూడా నిధులు కొరత రాకుండా చూడాలని కోరారు. కాగా, ఈ ఏడాది (2026) అమెరికా రక్షణ బడ్జెట్ 840 బిలియన్ డాలర్లుకు ఆమోదించబడింది.


