పారిస్‌ మేయర్‌గా ఎమ్మాన్యుయెల్ | France municipal elections : Emmanuel Gregoire elected Paris mayor | Sakshi
Sakshi News home page

పారిస్‌ మేయర్‌గా ఎమ్మాన్యుయెల్

Mar 23 2026 3:36 AM | Updated on Mar 23 2026 3:36 AM

France municipal elections : Emmanuel Gregoire elected Paris mayor

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడగా, సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి ఎమ్మాన్యుయెల్ గ్రెగోయర్ విజయం సాధించారు. ఆయన, అదే పార్టీకి చెందిన మాజీ మేయర్ ఆన్ హిడాల్గో స్థానాన్ని భర్తీ చేస్తూ, కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు.

గ్రెగోయర్, కన్సర్వేటివ్ ప్రత్యర్థి రషిదా దాతిపై స్పష్టమైన ఆధిక్యం సాధించారు. విజయం అనంతరం గ్రెగోయర్ మాట్లాడుతూ.. ఇది ఒక కొత్త పారిస్ విజయం. ఉత్సాహభరితమైన, ప్రగతిశీలమైన పారిస్ అని పేర్కొన్నారు. మేయర్‌గా ఎన్నికైన వెంటనే గ్రెగోయర్‌ సైకిల్‌పై నగర వీధుల్లో చక్కర్లు కొట్టారు.  

కాగా, ఫ్రాన్స్‌లో 1500 కమ్యూన్లలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మేయర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆరు సంవత్సరాల పదవీకాలానికి ఎన్నికయ్యారు. పారిస్‌తో పాటు మార్సెయ్, నీస్ వంటి ప్రధాన నగరాల్లో పోటీ తీవ్రంగా జరిగింది.  ఫ్రాన్స్‌లో వచ్చే ఏడాది (2027) అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement