హమ్మయ్య..ఆయన చనిపోయాడు..!  | Im glad he is dead, Trump says after learning of former FBI director passing | Sakshi
Sakshi News home page

హమ్మయ్య..ఆయన చనిపోయాడు..! 

Mar 23 2026 3:02 AM | Updated on Mar 23 2026 6:00 AM

Im glad he is dead, Trump says after learning of former FBI director passing

ఎఫ్‌బీఐ మాజీ చీఫ్‌ ముల్లర్‌ మృతిపై ట్రంప్‌ హర్షం 

వాషింగ్టన్‌: అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ (ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌)కు దీర్ఘకాలం డైరెక్టర్‌గా పనిచేసిన రాబర్ట్‌ ఎస్‌ ముల్లర్‌(81) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ముల్లర్‌ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబం శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనిపై, ట్రంప్‌ హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. ‘హమ్మయ్య..ఆయన చనిపోయారు. చాలా సంతోషంగా ఉంది. అమాయకులను ఆయన ఇక ఏమాత్రం బాధపెట్టలేరు’అంటూ సోషల్‌ మీడియాలో ట్రంప్‌ పోస్ట్‌ చేశారు. 

2016 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి ట్రంప్‌ ప్రచార బృందం రష్యాతో చేతులు కలిపినట్లు వచ్చిన ఆరోపణలపై న్యాయ శాఖ చేపట్టిన విచారణలో ముల్లర్‌ ప్రత్యేక న్యాయవాదిగా వ్యవహరించారు. రష్యా జోక్యం మాట వాస్తవమేననీ, కుట్ర పన్నినట్లు మాత్రం తగు ఆధారాలు లేవని ముల్లర్‌ తన నివేదికలో పేర్కొన్నారు. 

2001లో అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్‌ ఆయన్ను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నామినేట్‌ చేశారు. సెపె్టంబర్‌ 11 దాడులకు కేవలం వారం రోజులు ముందుగా డైరెక్టర్‌ బాధ్యతలను చేపట్టారు. దాదాపు 12 ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన..ప్రపంచం నివ్వెరపోయిన రీతిలో చోటుచేసుకున్న ఉగ్రదాడుల నేపథ్యంలో ఎఫ్‌బీఐని భవిష్యత్‌ సవాళ్లను ఎదుర్కొనే రీతిలో పూర్తి స్థాయిలో పటిష్టం చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement