ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ కెమెరా.. 266 ఐఫోన్ 14 ప్రోలతో సమానం..

Us Engineers Unveiled World Largest Digital Camera - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరాను ఆవిష్కరించారు అమెరికా ఇంజనీర్లు. ఎస్‌ఎల్‌ఏసీ నేషనల్ యాక్సిలరేటర్‌ లేబొరేటరీలో దీన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం రెండేళ్లుగా శ్రమిస్తున్నారు. అయితే ఈ ఎల్‌ఎస్‌ఎస్‌టీ డిజిటల్‌ కెమెరా ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కానీ అన్ని భాగాలను అమర్చారు. ఆపరేట్ చేసి ఫోటోలు తీసేందుకు ఇంకాస్త సమయం పడుతుంది.

ఎల్‌ఎస్‌ఎస్‌టీ కెమెరా అంటే?
ఎల్‌ఎస్‌ఎస్‌టీ అంటే 'లార్జెస్ట్ సినాప్టిక్‌ సర్వే టెలిస్కోప్‌' డిజిటల్ కెమెరా. ఉత్తర చీలిలోని 2,682 మీటర్ల ఎత్తయిన పర్వతం సెర్రో పచోన్‌ అంచున 2023లో ఏఫ్రిల్‌లో దీన్ని అమర్చనున్నారు. భూమిపై పరిశోధలనకు ఈ ప్రాంతం అత్యంత అనువైంది. జెమినీ సౌత్, సౌథర్న్ ఆస్ట్రోఫిజికల్ రీసెర్చ్ టెలిస్కోప్‌లు ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్నాయి.

ఈ డిజిటల్ కెమెరాలోని సెన్సార్లు అత్యాధునిక ఐఫోన్‌ 14 ప్రోతో పోల్చితే చాలా రెట్లు అధికం. దీని ఓవరాల్ రిజొల్యూషన్‌ 3.2 గిగాపెక్సెల్స్‌ లేదా 3200 మెగా పిక్సెళ్లు. అంటే 266 ఐఫోన్ 14ప్రో ఫోన్లతో ఇది సమానం. ఈ కెమెరాతో 15 మైళ్ల దూరంలో ఉన్న గోల్ఫ్ బంతిని కూడా క్లియర్‌గా చూడవచ్చు. ఇది చిన్న కారు సైజు పరిమాణం, మూడు టన్నుల బరువుంటుంది.
చదవండి: బ్రిటన్‌లో నేరాల కట్టడికి ఈ- రిక్షాలు!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top