ఇరాన్‌ రాజధానిలో వైమానిక దాడులు | US and Israeli airstrikes target multiple cities, including Tehran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ రాజధానిలో వైమానిక దాడులు

Apr 7 2026 7:55 PM | Updated on Apr 7 2026 8:09 PM

US and Israeli airstrikes target multiple cities, including Tehran

టెహ్రాన్‌: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని అమెరికా-ఇజ్రాయెల్‌లు వైమానిక దాడులతో బీభత్సం సృష్టించాయి. ప్రధాన రవాణా మార్గాలపై వరుసగా వైమానిక దాడులు జరిగాయి. ఇరాన్‌ మీడియా కథనాల ప్రకారం.. ఈ దాడులు హెమ్మత్ హైవే ప్రాంతంలో ఉత్తర రన్‌వే జరిగినట్లు తెలుస్తోంది. 

తాజాగా జరిగిన దాడుల్లో పలు వంతెనలు, రహదారులు లక్ష్యంగా మారాయి. తబ్రీజ్–టెహ్రాన్ ఫ్రీవే, జంజాన్–టెహ్రాన్ ఫ్రీవే, కోమ్‌లోని రవాణా మార్గాలు కూడా దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి.  

ఇరాన్ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. యుద్ధం మొదలైనప్పటి నుంచి  238 మంది విద్యార్థులు, 49 మంది ఉపాధ్యాయులు, 7 మంది టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. 178 మంది విద్యార్థులు, 24 మంది ఉపాధ్యాయులు గాయపడినట్లు తెలిపింది. నివేదికల ప్రకారం, ఇప్పటి వరకు 764 పాఠశాలలు లక్ష్యంగా అమెరికా దాడులు జరిపినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో ఎక్కువ భాగం టెహ్రాన్, కెర్మాన్షా ప్రావిన్సులలో ఉన్నాయి. పౌర ప్రాంతాలపై జరిగిన ఈ దాడులు అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలను బలి తీసుకున్నాయి.
 
పాఠశాలలు, వంతెనలు, రహదారులు వంటి పౌర మౌలిక సదుపాయాలపై దాడులు జరగడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పౌరులపై దాడులు యుద్ధ నేరాలుగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

టెహ్రాన్–కరాజ్ ఫ్రీవేపై జరిగిన తాజా వైమానిక దాడులు ఇరాన్‌లోని పౌర జీవనాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోవడం, పాఠశాలలు ధ్వంసం కావడం దేశ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.  యుద్ధం కొనసాగితే ఇరాన్‌లోని పౌర మౌలిక సదుపాయాలు నాశనమయ్యే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement