రష్యా నౌకాశ్రయంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి..  

Ukrainian Drone Disables Russian Warship Near Novorossiysk Port - Sakshi

మాస్కో: నోవోరోసిస్క్ లోని రష్యా నల్ల సముద్ర నౌకాదళ స్థావరంపై ఉక్రేనియన్ డ్రోన్ దాడికి పాల్పడిండి. ఈ దాడిలో రష్యా యుద్ధనౌక దారుణంగా దెబ్బతింది. దీంతో నౌకాశ్రయంలోని కార్యకలాపాలను నిలిపివేసినట్లు తెలిపింది కాస్పియన్ పైప్‌లైన్ కన్సార్టియం. ఈ దాడికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ ఇంటర్నెట్లో వైరలయ్యాయి. 

నిరంతరాయంగా కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ రష్యాను చావుదెబ్బ తీసింది. ప్రపంచ దేశాలకు చమురు తోపాటు ధాన్యాన్ని సరఫరా చేసే రష్యా నల్ల సముద్ర నౌకాదళ స్థావరంపై ఉక్రేనియన్ డ్రోన్ దాడి చేసింది. దాడిలో ఒలెనెగోర్స్కీ గోర్న్యాక్ అనే యుద్ధ నౌక తీవ్రస్థాయిలో దెబ్బతింది. డ్రోన్ల ద్వారా సుమారు 450 కిలోల టీఎన్‌టీని మోసుకెళ్లి ఓడను ఢీకొట్టినట్లు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వర్గాలుప్రకటించాయి. దాడి సమయంలో యుద్ధనౌకపై సుమారు 100 మంది రష్యా సాయుధులు ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు. రాత్రిపూట జరిగినా కూడా డ్రోన్ కెమెరాలో దాడికి సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ వీడియాను ఉక్రెయిన్ బలగాలు మీడియాకు చేరవేశాయి.    

దాడి అనంతరం రష్యా బలగాలు రెండు సీ డ్రోన్ల సాయంతో బేస్ వెలుపల ఉక్రెయిన్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. దాడిలో జరిగిన నష్టం గురించి మాత్రం వారు ప్రస్తావించలేదు. ఉక్రెయిన్ రిటైర్డ్ నావికా దళాధిపతి ఆండ్రియ్ రైజంకో మాట్లాడుతూ ఈ దాడుల కోసం ఉక్రెయిన్ సముద్ర డ్రోన్లు దాదాపు 760 కిలోమీటర్లు ప్రయాణించి ఉంటాయని. ఉక్రెయిన్ డ్రోన్లు అంత దూరం ప్రయాణించడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. 

ఇది కూడా చదవండి: పుతిన్ శత్రువుపై మరిన్ని కేసులు.. ఎంత కాలం శిక్ష పడనుందో తెలుసా?   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top