వాళ్లను వెనకేసుకు రావడం ఏంటి? బ్రిటన్‌ ప్రధాని తీరుపై సొంతపార్టీలో విమర్శలు

UK PM Rishi Sunak Reacts Gavin Williamson texts to Wendy Morton Row - Sakshi

లండన్‌: బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ తీరుపై కన్జర్వేటివ్‌ పార్టీ సీనియర్లలో అసంతృప్తి పెల్లుబిక్కుతోంది. వివాదాల్లో నిలిచిన వ్యక్తులను కేబినెట్‌లోకి తీసుకోవడం.. పైగా వాళ్లను వెనకేసుకొస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నగాక మొన్న సువెల్లా బ్రేవర్‌మన్‌ను తిరిగి మంత్రిగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆ వేడి చల్లారకముందే తప్పు చేసిన మరో మంత్రిని వెనకేసుకు రావడం ద్వారా ఆయన మరోసారి విమర్శలపాలవుతున్నారు. 

సండేటైమ్స్‌ కథనం ప్రకారం.. మంత్రి గేవిన్‌ విలియమ్‌సన్‌.. మాజీ పార్టీ విప్‌, వెంటీ మోర్టన్‌కు ఫోన్‌ ద్వారా అసభ్యమైన సందేశాలు పంపారు. ఈ విషయాన్ని మరో మంత్రి ఒలీవర్‌ డౌడెన్‌ తాజాగా మీడియాకు వెల్లడించారు. వర్ణించలేని రీతిలో గేవిన్‌, ఆమెను తిట్టినట్లు తెలుస్తోంది. క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియల సమయంలో ఆహ్వానం అందకపోవడంపై రగిలిపోతూ వెంటీకి అలా మెసేజ్‌లు చేశాడట. అయితే.. ఈ వ్యవహారాన్ని ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సునాక్‌ దృష్టికి తీసుకెళ్లారు పార్టీ మాజీ చైర్మన్‌ సర్‌ జేక్‌ బెర్రీ. 


ఫోన్‌ సంభాషణలను మీడియాకు చూపిస్తున్న డౌడెన్‌

మరోవైపు కన్జర్వేటివ్‌ పార్టీ గవర్నింగ్‌ బాడీకి ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గేవిన్‌-వెంటీ మధ్య వైరం సంగతి రిషి సునాక్‌కు ముందు నుంచే తెలుసని, అయినప్పటికీ గేవిన్‌ను సునాక్‌ వెనుకేసుకొస్తున్నారని డౌడెన్‌ ఆరోపించారు. 

ఇక తీవ్ర విమర్శల నేపథ్యంలో బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ స్పందించారు. గేవిన్‌ చర్యలు సరికాదని, ఆమోదయోగ్యం ఎంతమాత్రం కాదని అన్నారు. అలాగే ఈ వ్యవహారంలో ఎవరికీ వెనుకేసుకు రావాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఫిర్యాదు నేపథ్యంలో.. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని ఆయన చెప్పారు. అంతకు ముందు సువెల్లా బ్రేవర్‌మన్‌ నియామకాన్ని ఆయన సమర్థించుకున్న సంగతి తెలిసిందే!.

ఇదీ చదవండి: మూలాలపై రిషి సునాక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top