జీతం సరిపోట్లేదు... సమ్మె బాటపట్టిన టీచర్లు, లెక్చరర్లు  తపాలా సిబ్బంది.. | Sakshi
Sakshi News home page

జీతం సరిపోట్లేదు... సమ్మె బాటపట్టిన టీచర్లు, లెక్చరర్లు  తపాలా సిబ్బంది..

Published Fri, Nov 25 2022 9:33 AM

Uk Lecturers Teachers Postal Workers Strike Over Pay Hike - Sakshi

లండన్‌: పెరుగుతున్న జీవన వ్యయానికి తగ్గట్లుగా వేతనాలను పెంచాలని కోరుతూ యూకేలో వేల సంఖ్యలో పోస్టల్‌ సిబ్బంది, యూనివర్సిటీ లెక్చరర్లు, స్కూల్‌ టీచర్లు గురువారం సమ్మెకు దిగారు. ఇప్పటికే వివిధ రంగాల సిబ్బంది సమ్మెల్లో పాల్గొనడంతో దేశంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. వీధుల్లో చెత్తాచెదారం గుట్టలుగా పేరుకుపోయింది.

ఇటీవల లాయర్లు, నర్సులు కూడా పలుమార్లు విధులను బహిష్కరించారు.  గురువారం యూనివర్సిటీల్లో 70 వేల మంది లెక్చరర్లు బోధన విధులను బహిష్కరించారు. ఈ నెల 30వ తేదీన మరోసారి స్ట్రైక్‌ చేస్తామని తెలిపారు.

సమ్మె ప్రభావం సుమారు 25 లక్షల మంది విద్యార్థులపై పడింది. స్కాట్లాండ్‌లో టీచర్ల సమ్మెతో దాదాపు సూళ్లన్నీ మూతబడ్డాయి. రాయల్‌ మెయిల్‌ ఉద్యోగులు గురు, శుక్రవారాలతోపాటు క్రిస్టమస్‌ రోజున కూడా సమ్మెకు దిగుతామన్నారు.
చదవండి: మలేసియా నూతన ప్రధానిగా అన్వర్‌ ఇబ్రహీం.. మద్ధతు ఇచ్చిన బద్ధ శత్రువు

Advertisement
Advertisement