టర్కీ భూకంపం.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో.. తన ప్రాణాలు అడ్డేసి కుమారుడ్ని కాపాడిన తండ్రి..

Turkey Earthquake Father Gave Life To Son Viral Video - Sakshi

ఇస్తాన్‌బుల్‌: టర్కీలో సోమవారం సంభవించిన భూకంపం వేల మందికి బలికొంది. తవ్వేకొద్ది మృతదేహాలు లభిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుక్కున్న వారిలో చాలా మంది చనిపోగా.. మరికొంత మంది ప్రాణాలతో బయపడ్డారు.

అయితే ఓ తండ్రీకొడుకుల వీడియో మాత్రం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఓ వ్యక్తి తన ప్రాణాలను అడ్డేసి కుమారుడి ప్రాణాలు నిలిపాడు. శిథిలాల కింద చిక్కుకుని అతను కన్నుమూసినా కుమారుడు మాత్రం క్షేమంగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

సహాయక బృందాలు శిథిలాలు తొలగిస్తున్న సమయంలో మొదట మట్టిలోక కూరుకుపోయి ఉన్న తండ్రి విగతజీవిగా కన్పించాడు. అతను కౌగిలించుకుని ఉన్న కుమారుడు కూడా మరణించి ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు చిన్నారి ప్రాణాలతోనే ఉన్నాడు. దీంతో సహాయక సిబ్బంది వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
చదవండి: షాకింగ్.. భూకంపం ధాటికి 6 మీటర్లు పక్కకు జరిగిన టర్కీ!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top