
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఆపి.. ఇరు దేశాల్లో మధ్య శాంతిని నెలకొల్పేందుకు తాను భారత్‌పై టారిఫ్‌లు విధించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశ సుప్రీంకోర్టుకు తెలిపారు. సుంకాలు విధించడం వల్లే దేశం ఆర్ధికంగా ముందంజంలో ఉంది.. లేదంటే అంతం అవుతుందని బదులిచ్చారు.
భారత్‌తో పాటు ప్రపంచంలో పలు దేశాలపై 1977 ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్స్ పవర్స్ యాక్ట్ (IEEPA) నిబంధనలకు మించి ఎక్కువ మొత్తంలో టారిఫ్‌లు విధించడాన్ని క్రిందికోర్టు తప్పుబట్టింది. దీంతో ఆ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. టారిఫ్‌లపై ట్రంప్ ప్రభుత్వం తరుఫున సొలిసిటర్ జనరల్ జాన్ సౌర్ తన వాదనల్ని వినిపిస్తున్నారు.
తనవాదనల్లో ఉక్రెయిన్‌లో శాంతి కోసం మా ప్రయత్నాల్లో కీలకమైన అంశం. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం కొనసాగడానికి కారణం భారత్. భారత్.. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుంది. అమ్మకాల ద్వారా వచ్చిన నిధుల్ని యుద్ధం కోసం ఖర్చు పెడుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. అందుకే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకుగాను భారత్‌పై సుంకాలు విధించాం. ఇప్పుడీ టారిఫ్‌ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గించినా ఆర్ధికంగా అమెరికాకు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
సుంకాలతో అమెరికా ధనిక దేశం. సుంకాలు లేకపోతే పేద దేశం. ఇప్పటికే దేశాలపై సుంకాల్ని ఉపసంహరించుకుంటే దేశ రక్షణ-పారిశ్రామిక రంగం బలహీనపడుతుంది. వార్షిక వాణిజ్య లోటులో 1.2 ట్రిలియన్ల డాలర్ల వరకు నష్టం వాటిల్లుతుంది. కొనసాగుతున్న విదేశీ చర్చలపై అనిశ్చితి నెలకొంటుందని’ అది వాదించింది. సుంకాల కారణంగా..ఆరు ప్రధాన వాణిజ్య భాగస్వాములు,27 యూరోపియన్ యూనియన్ దేశాలతో కుదుర్చుకున్న ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాలు అమెరికాను ప్రపంచ స్థానాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొంది.
ఏడాది క్రితం అమెరికా అంతమైన దేశం. మరి ఇప్పుడు.. వ్యాపారం చేస్తూ లాభాల్ని అర్జించిన దేశాలు చెల్లించే ట్రిలియన్ల డాలర్ల టారిఫ్‌ల కారణంగా.. అమెరికా మళ్ళీ అన్నీ రంగాల్లో బలమైన,ఆర్థికంగా తన స్థానాన్ని సుస్ధిరం చేసుకుంటుందని తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది.