ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులే ఉత్తమం!

Study Says Most Homemade Masks Black Large Cough Droplets - Sakshi

ఆసక్తికర విషయాలు వెల్లడించిన పరిశోధకులు

వాషింగ్టన్‌: మహమ్మారి కరోనా కాలంలో ఫేస్‌మాస్కుల వినియోగం భారీగా పెరిగిపోయింది. కోవిడ్‌-19‌ బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు దాదాపు ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరిస్తున్నారు. కొంతమంది సర్జికల్‌, రిస్పిరేటర్ మాస్కులు ధరిస్తుంటే, చాలా మంది ప్రజలు ఇంట్లో అందుబాటులో ఉన్న వస్త్రంతో మాస్కు తయారు చేసుకుంటున్నారు. దీంతో క్లాత్‌ ఫేస్‌ కవరింగ్‌ మాస్కులకు డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. అయితే ఇలాంటి మాస్కులు సురక్షితమేనా? వైరస్‌ కణాలను అడ్డుకోవడంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయా? లేదా అన్న సందేహాలు తలెత్తుతున్న నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మార్కెట్లో లభించే వివిధ రకాల మాస్కుల కంటే ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులే(సింగిల్‌ లేయర్‌వి అయినా సరే) ఉత్తమమైనవని పేర్కొన్నారు. (చదవండి:  ‘కోవిడ్‌’ పెరుగుతున్నా మరణాలు ఎందుకు తక్కువ!)

అదే విధంగా అవతలి వ్యక్తి దగ్గినపుడు, లేదా తుమ్మినపుడు వెలువడే నీటి తుంపరలు మనల్ని చేరకుండా ఆపడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. సాధారణ వస్త్రం (ఉదా: టీషర్టు క్లాత్‌)తో తయారు చేసిన మాస్కులు మెడికల్‌ మాస్కుల కంటే ఏమాత్రం తీసిపోవని, పైగా గాలి పీల్చుకోవడంతో పాటు అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు జర్నల్‌ ఆఫ్‌ ఎక్స్ట్రీమ్‌ మెకానిక్స్‌ లెటర్స్‌ అధ్యయనంలో తమ పరిశోధనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నావల్‌ కరోనా వైరస్‌ కణాల పరిమాణంలో ఉన్న కణాలతో కూడిన డిస్టిల్డ్‌ వాటర్‌ను ఇన్‌హెల్లర్‌లో నింపి, ఓ ప్లాస్టిక్‌ పాత్రలో దానిని అధిక ద్రవ్యరాశి గల తుంపరల రూపంలో వాటిని వదిలిపెట్టారు. వివిధ రకాల మెటీరియళ్లతో వాటిని వడకట్టి, వేటికైతే కణాలను ఆపగల శక్తి ఎక్కువగా ఉందో పరిశీలించారు. (చదవండి: ఫేస్‌మాస్క్‌ల గురించి మనకు ఏం తెలుసు?)

ఈ విషయం గురించి అధ్యయనకర్త తాహిర్‌ సైఫ్‌ మాట్లాడుతూ.. ‘‘పాత్రలో పడుతున్న ప్రతీ నానో- పార్టికల్‌ను అత్యాధునిక మైక్రోస్కోపు ద్వారా పరిశీలించాం. వాటిని లెక్కించాం. వివిధ రకాల ఫ్యాబ్రిక్‌లను అడ్డుపెట్టి లేదా నేరుగా నీటి తుంపరలను వదిలి, ఏ ఫ్యాబ్రిక్‌ ఎంతమేర కణాలను బ్లాక్‌ చేయగలిగిందో పరిశీలించినపుడు సాధారణంగా ఇంట్లో ఉపయోగించే వస్త్రాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించాం. నిజానికి శ్వాస పీల్చుకోకుండా అసౌకర్యాన్ని కలిగించే మాస్కుల వల్ల ఊపిరాడటం కష్టమవడమే గాకుండా, వైరస్‌ కణాలు కూడా లీకయ్యే అవకాశం ఉంటుంది. 

మరి అలాంటి మాస్కులు ధరించినా ఉపయోగం ఉండదు కదా. నిజానికి మెడికల్‌ మస్కులు అందరికీ అందుబాటులో లేకపోయిన్పటికీ ఇంట్లో వాడే కామన్‌ ఫ్యాబ్రిక్‌లతో కూడా వైరస్‌ బారిన పడకుండా రక్షించుకునే అవకాశం ఉంటుందని నిరూపించడమే మా ఉద్దేశం. ఈ ప్రయోగంలో మేం మొత్తం 11 రకాల వస్త్రాల(బెడ్‌షీట్లు, కర్చిఫ్‌లు వంటివి)ను పరిశీలించాం. ఇందులో కొత్తవాటితో పాటుగా వాడినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అత్యంత వేగంతో ప్రయాణించే 100 నానోమీటర్‌ పార్టికల్స్‌ను కూడా సమర్థవంతంగా అడ్డుకోగలవని నిరూపితమైంది. ఇలాంటివి సింగిల్‌ లేయర్‌ మాస్కులైనా సరే ఎదుటి వ్యక్తి మాట్లాడినపుడు, తుమ్మినపుడు లేదా దగ్గినపుడు మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు’’ అని చెప్పుకొచ్చారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

19-10-2020
Oct 19, 2020, 19:45 IST
సాక్షి, కృష్ణా: కొత్తగా కరోనా పొజిటివ్ కేసులు నమోదు కావటంతో జిల్లాలో 6 కంటైన్మెంట్ జోన్‌లను ప్రకటించినట్లు కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు....
19-10-2020
Oct 19, 2020, 10:12 IST
ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 66,63,608. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 7,72,055. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ...
19-10-2020
Oct 19, 2020, 09:00 IST
కైవ్‌: కరోనా వైరస్‌ బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది మరణిస్తున్నారు. అయితే ఇప్పటికి చాలా మందిలో కరోనా వైరస్‌కు...
19-10-2020
Oct 19, 2020, 08:42 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 26,027 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు...
19-10-2020
Oct 19, 2020, 04:32 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయిని దాటి పోయిందని కోవిడ్‌–19పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ...
19-10-2020
Oct 19, 2020, 03:19 IST
సాక్షి, అమరావతి: కరోనా రికవరీలోనూ ఆంధ్రప్రదేశ్‌ ముందుకు దూసుకుపోతోంది. కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరగడంతో ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో...
19-10-2020
Oct 19, 2020, 03:05 IST
సాక్షి, హైదరాబాద్‌: దసరా, దీపావళి పండగల వేళ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న దృష్ట్యా దీన్ని నివారించేందుకు...
18-10-2020
Oct 18, 2020, 15:48 IST
సాక్షి, న్యూఢిల్లీ :  కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ శశిథరూర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. విమర్శలు ఎదుర్కొంటున్నారు. కరోనా నియంత్రణ విషయంలో...
18-10-2020
Oct 18, 2020, 14:29 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ ముమ్మర దశను దాటిందని వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మహమ్మారి అంతం...
18-10-2020
Oct 18, 2020, 10:25 IST
న్యూఢిల్లీ: దేశ్యాప్తంగా కరోనాబారినపడి మరో 1033 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,14,031 కు చేరింది....
18-10-2020
Oct 18, 2020, 09:55 IST
లక్నో: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లో రోజురోజుకూ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1,14,031 మందిని పొట్టనబెట్టుకుంది. బిహార్‌లోనూ పంజా...
17-10-2020
Oct 17, 2020, 18:59 IST
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
17-10-2020
Oct 17, 2020, 17:53 IST
రష్యా అభివృద్ది చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కు మన దేశంలో అనుమతి లభించింది.
17-10-2020
Oct 17, 2020, 14:52 IST
కరోనా తీవ్రత ఎక్కువగా ప్రాంతాల్లో భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు కూడా భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
17-10-2020
Oct 17, 2020, 14:05 IST
సాక్షి, హైదరాబాద్‌: న‌టుడు జీవితా రాజ‌శేఖ‌ర్ కుటుంబ సభ్యులు క‌రోనా మహమ్మారి బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా రాజ‌శేఖ‌ర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు....
17-10-2020
Oct 17, 2020, 12:59 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్‌...
17-10-2020
Oct 17, 2020, 11:50 IST
తిరువనంతపురం : దాదాపు ఏడు నెలల తర్వాత కేరళలోని శబరిమల ఆలయంలోకి భక్తులను అనుమతించారు. నెలవారీ పూజా కార్యక్రమాల్లో భాగంగా అయిదు రోజుల...
17-10-2020
Oct 17, 2020, 10:38 IST
వాషింగ్టన్‌: ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలో ఇప్పటికే కరోనా కేసులు 8 మిలియన్లు దాటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల నాటికి...
17-10-2020
Oct 17, 2020, 09:49 IST
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 74 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 62,212 పాజిటివ్‌...
17-10-2020
Oct 17, 2020, 09:05 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 42,497 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top