కిమ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన దక్షిణ కొరియా.. మరోసారి రిపీట్ అయితే అంతే..!

South Koreayoon Warns North Korea Kim Violates Airspace - Sakshi

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్‌ యోల్‌.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‍కు హెచ్చరికలు జారీ చేశారు. తమ గగనతలంలోకి మరోసారి కిమ్ దేశానికి చెందిన డ్రోన్లు ప్రవేశిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. అవసరమైతే 2018లో కుదుర్చుకున్న సైనిక ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కిమ్ దేశం హద్దులు మీరొద్దని తేల్చి చెప్పారు.

గతవారం ఉత్తరకొరియా డ్రోన్లు దక్షిణ కొరియాలోకి ప్రవేశించాయి. నిబంధనలు ఉల్లంఘించి సరిహద్దు దాటి చక్కర్లు కొట్టాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన యూన్ సుక్.. పొరుగు దేశం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తమ సైన్యం ఈ విషయంలో వ్యవహిరించిన తీరుపైనా మండిపడ్డారు. డ్రోన్లు తమ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు సైన్యం సరైన రీతిలో స్పందించాల్సిందని వ్యాఖ్యానించారు. హద్దు మీరినప్పుడు చూస్తూ ఉరుకోవద్దన్నారు.

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య దశాబ్దాల కాలంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. యూన్ సుక్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పొరుగు దేశంతో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. కిమ్ దేశం నిబంధనలు ఉల్లంఘిస్తే దీటుగా బదులిస్తున్నారు.
చదవండి: రష్యా సినిమా హాళ్లలో ఉక్రెయిన్‌పై దాడి దృశ్యాలు.. పుతిన్‌ కీలక ఆదేశాలు

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top